Share News

Green Tea: గ్రీన్ టీ తాగితే కలిగే 5 అద్బుత ఫలితాలు ఇవీ..!

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:41 PM

గ్రీన్ టీ తాగే చాలామందికి ఈ విషయాలు తెలిసి ఉండవు.

Green Tea: గ్రీన్ టీ తాగితే కలిగే 5 అద్బుత ఫలితాలు ఇవీ..!

ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ తాగుతుంటారు. గ్రీన్ టీని సహజ డిటాక్స్ పానీయంగా పేర్కొంటారు. రోజూ ఓ కప్పు గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. గ్రీన్ టీ తాగితే కలిగే 5 అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..

ఫ్రీ రాడికల్స్..

గ్రీన్ టీలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే కాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ధీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కండరాల నొప్పి, వాపును నియంత్రించడంలో సహయపడతాయి.

గుండె ఆరోగ్యం..

గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది.

బరువు..

చాలామంది గ్రీన్ టీ తాగడానికి ముఖ్య కారణం బరువు తగ్గాలని. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్, కెఫిన్ జీవక్రియను పెంచుతాయి. కొవ్వును బర్న్ చేస్తాయి. ఆకలిని నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడతాయి. తక్కువ కేలరీలు తీసుకోవడంలో దోహదం చేస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ..

గ్రీన్ టీ గొప్ప ఇమ్యునిటీ బూస్టర్. యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్పెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చడంలో సహాయపడతాయి.

నోటి ఆరోగ్యం..

గ్రీన్ టీ లో ఉండే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు దంత క్షయం, దంతాల మీద ఫలకం పేరుకోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చిగుళ్ల వ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది. నోటి శుభ్రతను కాపాడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 12:41 PM