Share News

Hair Care: ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే.. తెల్లజుట్టు మాయమవుతుంది..!

ABN , Publish Date - Aug 29 , 2024 | 01:42 PM

ఆయుర్వేదం భారతీయ పురాతన వైద్య విధానం. అనేక ఆరోగ్య సమస్యలను మూలాల నుండి నయం చేయడంలో ఆయుర్వేదం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా జుట్టు నెరిసిపోవడాన్ని ఆపి తిరిగి నల్లగా మార్చుతుంది.

Hair Care:  ఆయుర్వేదం చెప్పిన  ఈ టిప్స్ ఫాలో అయితే..  తెల్లజుట్టు మాయమవుతుంది..!
Hair Care Tips

ఆయుర్వేదం భారతీయ పురాతన వైద్య విధానం. అనేక ఆరోగ్య సమస్యలను మూలాల నుండి నయం చేయడంలో ఆయుర్వేదం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా జుట్టు నెరిసిపోవడాన్ని ఆపి తిరిగి నల్లగా మార్చుతుంది. ఆయుర్వేదం చెప్పిన కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు తిరిగి శాశ్వతంగా నల్లగా మారుతుంది. అవేంటో తెలుసుకుంటే..

ఉసిరి..

ఉసిరిని అమలకి అని కూడా అంటారు. దీన్ని ఆహారంలో మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా వాడతారు. ఉసిరికాయ నూనెను తయారు చేసుకుని వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.


Soaked Walnuts: వాల్నట్స్ ను నానబెట్టే ఎందుకు తినాలి? అసలు నిజాలు ఇవే..!


బృంగరాజ్..

బృంగరాజ్ ను మూలికల రాజు అని కేశ్ కింగ్ అని పిలుస్తారు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టును నల్లగా మారుస్తుంది.

మందార..

మందార నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టుకు మెరుపును ఇస్తుంది. జుట్టు బూడిద రంగులోకి మారకుండా అడ్డుకుంటుంది.

మసాజ్..

ఆయుర్వేద నూనెలను కొద్ది కొద్దిగా మునివేళ్ళతో అద్దుకుంటూ తల మాడుకు సున్నితంగా మసాజ్ చెయ్యాలి. ఇలా చేస్తే తల చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా, నల్లగా పెరుగుతుంది.

Migraine: మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో సమస్య నుండి బయటపడవచ్చు..!


పోషకాహారం..

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కేవలం నూనెలు మాత్రమే కాకుండా పోషకాహారం కూడా తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. జుట్టు నల్లబడటానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మంచి ఆహారం తీసుకోవాలి.

ఓపిక..

నెరిసిపోతున్న జుట్టును తిరిగి నల్లగా మార్చడంలో, జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో ఆయుర్వేదం నూనెలు, ఆహారాలు సమర్థవంతంగా పనిచేసినప్పటికీ వాటి నుండి ఉత్తమ ఫలితాలు పొందాలంటే ఓపిక అవసరం. వీటిని దీర్ఘకాలం ఉపయోగించాలి. అలా చేస్తే జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.

ఇవి కూడా చదవండి..

Ginger Tea: మీకు అల్లం టీ అంటే ఇష్టమా? ఈ సమస్యలు ఉన్నవారు అల్లం టీ తాగకూడదట..!


Low BP: లో బీపీ సమస్య ఉందా? ఈ 3 వస్తువులు వెంట ఉంచుకుంటే మంచిది..!


Hair Care: ఈ నూనెను 30 రోజులు వాడితే చాలు.. జుట్టు రాలడం ఆగడమే కాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 29 , 2024 | 01:42 PM