Hair Care: జుట్టు దువ్వేటప్పుడు చేసే ఈ పొరపాట్లే జుట్టు రాలడానికి అసలు కారణాలు..!
ABN , Publish Date - Oct 10 , 2024 | 08:49 PM
చాలామందికి జుట్టు ఎందుకు రాలుతోంది అనే కారణాలు కూడా అర్థం కావు.. దీని వల్ల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ మార్చి మార్చి వాడుతుంటారు. కానీ వాళ్లు చేసే అసలు మిస్టేక్స్ ఇవే..
జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారుు. కానీ నేటి కాలంలో జుట్టు పెరుగుదల కోసం పడని కష్టాలు ఉండవు. జుట్టు ఆరోగ్యంగా పెరగాలని షాంపూల నుండి హెయిర్ ఆయిల్ వరకు.. మంచి ఎంపికలు చూసుకుంటారు. అంతేనా చాలా రకాల హెయిర్ కేర్ టిప్స్ కూడా పాటిస్తారు. కానీ జుట్టు పెరగడం కొందరికి సవాల్ లాగా ఉంటుంది. అయితే జుట్టు దువ్వే విధానం కూడా జుట్టు రాలడానికి, జుట్టు డ్యామేజ్ కావడానికి కారణం అవుతుంది. జుట్టు దువ్వేటప్పుడు చాలా మంది చేసే పొరపాట్లు ఏంటో.. తెలుసుకుంటే..
Peanuts: అందరూ ఎంతో ఇష్టంగా తినే వేరుశనగ.. ఈ సమస్యలు ఉన్నవారికి చాలా డేంజర్..!
దువ్వేటప్పుడు జుట్టు ఎందుకు రాలుతుంది?
ఎక్కువగా దువ్వడం..
జుట్టు దువ్వేటప్పుడు చాలా మంది పదే పదే దువ్వుతూ ఉంటారు. అయితే జుట్టును నిటారుగా పై నుండి కింద వరకు ఒక క్రమ పద్దతిలో దువ్వాలి. ఇలా దువ్వితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కానీ జుట్టును పదే పదే వేగంగా దువ్వితే తల చర్మం పై గీతలు పడతాయి. కుదుళ్ల మీద ఒత్తిడి పడుతుంది. ఇది జుట్టును బలహీనపరుస్తుంది.
తడి జుట్టు..
జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం కూడా తప్పు. ఇలా దువ్వితే జుట్టు మూలాల నుండి బలహీనంగా మారుతుంది. ఇది జుట్టు బలహీనంగా మారేలా చేస్తుంది. అందుకే జుట్టు పూర్తీగా ఆరే వరకు తల దువ్వకూడదు.
దువ్వెన..
జుట్టు దువ్వడంలో చాలామంది చేసే తప్పు వ్యక్తిగతంగా దువ్వెన ఉంచుకోకపోవడం. ఒకరి దువ్వెనను మరొకరు దువ్వడం వల్ల జుట్టు సంబంధ సమస్యలు తొందరగా వస్తాయి. దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. ఇవి జుట్టు చాలా రాలడానికి కారణం అవుతాయి.
Skin Care: కళ్ల కింద చర్మం ముడతలు పడిందా? ఈ ఐ ప్యాక్ ట్రై చేయండి..!
దువ్వే విధానం..
చాలా మంది జుట్టును దువ్వే విధానం తప్పుగా ఉంటుంది. జుట్టును ఎప్పుడూ పై నుండి కిందకు దువ్వాలి. అది కూడా జుట్టును రెండు భాగాలుగా విభజించుకొని జుట్టు చిక్కు తీసుకోవాలి. అంతే కానీ కింద నుండి పైకి దువ్వకూడదు. దీని వల్ల చిక్కు పెరుగుతుంది.
ఎక్కువ కాలం దువ్వకపోవడం..
జుట్టు రోజులో రెండు సార్లు పద్దతిగా దువ్వుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కానీ చాలా మంది పనులలో పడి జుట్టును దువ్వకుండా వదిలేస్తారు. కనీసం ఒక రోజు మొత్తం జుట్టును దువ్వకపోయినా జుట్టు దారుణంగా చిక్కులు పడుతుంది. ఆ తరువాత జుట్టును ఎంత జాగ్రత్తగా దువ్వినా జుట్టు దారుణంగా రాలిపోతుంది.
దువ్వెన ఎంపిక..
జుట్టు దువ్వడానికి దువ్వెన ఎంపిక కూడా ప్రధానం. సాధారణంగా జుట్టు దువ్వడానికి పెద్ద పళ్లు ఉన్న దువ్వెనను ఎంచుకోవాలి. అలా కాకుండా సన్న పళ్లు ఉన్న దువ్వెనతో దువ్వితే జుట్టు రాలిపోవడం ఎక్కువగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?
చర్మాన్ని యవ్వనంగా ఉంచే విటమిన్-ఇ పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఇవే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.