Hair Care: వంటింట్లో ఉన్న ఈ ఒక్క పదార్థం వాడితే చాలు.. జుట్టు ఎంత ఆరోగ్యంగా మారుతుందంటే..!
ABN , Publish Date - Sep 20 , 2024 | 07:06 PM
జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు.. వంటింట్లో ఉండే ఈ పదార్థం వాడితే చాలు.
ఈ కాలంలో జుట్టు సంరక్షణ గురించి శ్రద్ద చాలా పెరిగింది. ముఖ్యంగా పార్లర్లకు వెళ్లి హెయిర్ కేర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి బదులు ఇంటి పట్టునే సహజంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. వంటింట్లో ఉండే పదార్థాలు జుట్టును దెబ్బతినకుండా, ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టును రిపేర్ చేస్తాయి. ఇంతకీ జుట్టును ఆరోగ్యంగా మార్చే వంటింటి పదార్థం ఏంటో అదెలా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే..
ఉసిరికాయ రసాన్ని నెల రోజులు ఖాళీ కడుపుతో తాగితే ఏమవుతుంది?
కాఫీ..
ప్రతి వంటింట్లో కాఫీ పొడి తప్పకుండా ఉంటుంది. ఉదయాన్నే పొగలు కక్కే కాఫీ లేనిది చాలామందికి ఏ పని మొదలు పెట్ట బుద్ధి కాదు. కానీ కాఫీ జుట్టు సంరక్షణలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా మార్చడమే కాకుండా జుట్టుకు మెరుపు ఇస్తుంది. జుట్టును బలంగా మారుస్తుంది.
ఎలా వాడాలి?
కాఫీని జుట్టుకు ఉపయోగించడం సులభం. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో కాఫీని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. దీన్ని 30 నుండి 40 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ కాఫీ మాస్క్ జుట్టును బలపరుస్తుంది. జుట్టును మెరిచేలా చేస్తుంది.
పెళ్లి తరువాత మగాళ్లు చేస్తున్న తప్పులివే..!
కెఫిన్..
కాఫీలో కెఫీన్ ఉంటుందనే విషయం తెలిసిందే.. అయితే ఈ కెఫీన్ జుట్టు మూలాలకు పోషణ ఇచ్చి జుట్టు నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రక్తప్రసరణ..
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తల చర్మానికి రక్త ప్రసరణ అవసరం. కాఫీలో ఉండే కెఫీన్ జుట్టు మూలాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
పలుచని జుట్టు..
చాలామంది జుట్టు పలుచగా ఉన్న సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు కాఫీ ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు పలుచబడటం అనే సమస్యను తగ్గించడంలో కాఫీ అద్భుతంగా సహాయపడుతుంది.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..!
పొడి జుట్టు..
జుట్టు పొడిబారి, నిస్తేజంగా ఉన్నప్పుడు కాఫీని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కాఫీని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది.
చుండ్రు..
చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు కాఫీని ఉపయోగిస్తే మంచి ఉపశమనం ఉంటుంది. కనీసం వారానికి ఒకసారి కాఫీని ఉపయోగిస్తుంటే జుట్టుకు మేలు జరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!
మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? అయితే మీరు లక్కీ..!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.