Hair Growth Gummies: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న హెయిర్ గ్రోత్ గమ్మీస్.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారుచేసుకోండి..
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:06 PM
జుట్టు పెరుగుదల కోసం ఇంట్లోనే హెయిర్ గ్రోత్ గమ్మీస్ తయారు చేసుకోవచ్చని, ఇవి ఎవరికి అయినా మంచి ఫలితాలు ఇస్తాయని అంటున్నారు ఆహార నిపుణులు.
జుట్టు ఆరోగ్యంగా పెరగాలని కోరుకోని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ముఖ్యంగా జుట్టు పెరుగుదల కోసం అమ్మాయిలు చాలా రకాల టిప్స్ ఫాలో అవుతారు. ఆహారం నుండి జుట్టు సంరక్షణ చిట్కాల వరకు బోలెడు ఫాలో అవుతారు. ఈ మధ్య కాలంలో జుట్టు పెరుగుదల కోసం నిర్థేశించిన వాటిలో హెయిర్ గ్రోత్ గమ్మీస్ కూడా ముఖ్యమైనవి. ఇవి జెల్లీ లాగా నములుతుంటే బంకలాగా ఉంటాయి. ఈ గమ్మీస్ ను రోజుకు ఒకటి తింటూ ఉంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఇవి అందరికీ సరైన ఫలితాలు ఇస్తాయనే గ్యారెంటీ కూడా లేదు.. అయితే జుట్టు పెరుగుదల కోసం ఇంట్లోనే హెయిర్ గ్రోత్ గమ్మీస్ తయారు చేసుకోవచ్చని, ఇవి ఎవరికి అయినా మంచి ఫలితాలు ఇస్తాయని అంటున్నారు ఆహార నిపుణులు. పోషకాహార నిపుణులు సిమ్రత్ కతురియా ఈ హెయిర్ గ్రోత్ గమ్మీస్ తయారీ విధానాన్ని ఎలా వివరించారో తెలుసుకుంటే..
Guava: చలికాలంలో జామపండ్లు తినాలని చెప్పేది ఇందుకే.. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..
హెయిర్ గ్రోత్ గమ్మీస్..
జుట్టు పెరుగుదల కోసం తీసుకునే గమ్మీస్ లో కొన్నింటిలో బయోటిన్ ఉంటుంది. మరికొన్నింటిలో విటమిన్-సి ఉంటుంది. ఇవన్నీ జుట్టు, చర్మం మెరుగ్గా ఉండటంలో సహాయపడతాయి.
ఇంట్లోనే గమ్మీస్.. కావలసిన పదార్థాలు..
క్యారెట్ - 1
దానిమ్మ - 1
బీట్‌రూట్ - 1
బ్లూబెర్రీస్ - 1 గిన్నె
నీరు - 1 కప్పు
తేనె - 2 స్పూన్లు
గిలెటిన్ పౌడర్ - 2 స్పూన్లు
కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..
తయారీ విధానం..
దానిమ్మపండు తొక్క వొలిచి దాని గింజలను తీయాలి.
క్యారెట్, బీట్‌రూట్‌లను పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మిక్సర్ తీసుకొని అందులో క్యారెట్, దానిమ్మ, బ్లూబెర్రీ,నీరు వేసి బాగా కలపాలి పేస్ట్ సిద్ధం చేయాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోని నీటిని కాటన్ క్లాత్ లేదా జల్లెడ సహాయంతో ఫిల్టర్ చేయాలి.
జ్యూస్ గిన్నెలో 2 స్పూన్ల గిలెటిన్ పౌడర్ వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ రసాన్ని ఒక పాత్రలో వేసి గ్యాస్‌పై ఉంచి తక్కువ మంట మీద మరిగించాలి.
గ్రేవీ లాగా చిక్కబడే వరకు ఉడకబెట్టాలి.
చిక్కబడ్డాక దానికి తేనె వేసి బాగా కలపాలి.
దీని తర్వాత గమ్మీస్ ట్రేని తీసుకొని అందులో గరాటు లేదా స్పూన్ సహాయంతో మిశ్రమాన్ని నింపాలి. చల్లారిన తరువాత గమ్మీస్ కు కాస్త షుగర్ పౌడర్ కోటింగ్ వేసి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇవి జుట్టు పెరుగుదలకు సూపర్ గా పనిచేస్తాయట.
ఇవి కూడా చదవండి..
ఈ ఒక్క పండు తింటుంటే చాలు.. కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చట..
Ayurveda Vs Korean: ఆయుర్వేద చర్మ సంరక్షణ, కొరియన్ చర్మ సంరక్షణ.. రెండింటిలో ఏది ఎఫెక్ట్ అంటే..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.