Share News

Hair Growth: ఇంట్లోనే ఈ 3 రకాల హెయిర్ సీరమ్ లు తయారు చేసుకుని వాడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!

ABN , Publish Date - Oct 05 , 2024 | 02:30 PM

ఇంట్లోనే మూడు రకాల హెయిర్ సీరమ్ లు తయారు చేసి వాడుతుంటే జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది.

Hair Growth:  ఇంట్లోనే ఈ 3 రకాల హెయిర్ సీరమ్ లు తయారు చేసుకుని వాడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!
Hair Serum

జుట్టు పెరుగుదల చాలామందికి అతిపెద్ద ఛాలెంజ్. జుట్టు అందంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలని కోరుకోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. జుట్టు పెరుగుదల కోసం మార్కెట్లో కొనుగోలు చేసే షాంపూలు, నూనెలు, సీరమ్ లు, హెయిర్ డై లు.. ఇలా అన్నీ రసాయనాలతో కూడినవే ఉంటాయి. ఇవి జుట్టును మరింత దెబ్బ తీస్తాయి. అయితే జుట్టు ఒత్తుగా పెరగడంలో హెయిర్ సీరమ్ లు టానిక్ లా పనిచేస్తాయి. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇంట్లోనే 3 రకాల హెయిర్ సీరమ్ లు తయారు చేసుకుని వాడవచ్చు. ఇంతకీ అవేంటో వాటిని ఎలా చేయాలో తెలుసుకుంటే..

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ కు పురుగులు పడుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!


కొబ్బరి నూనె సీరమ్..

కొబ్బరి నూనె సీరమ్ జుట్టు పెరుగుదలకు భలే సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

కొబ్బరినూనె.. 2 చెంచాలు

బాదం నూనె.. ఒక చెంచా

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్.. కొన్ని చుక్కలు

స్వచ్చమైన నీరు లేదా కెమికల్స్ లేని రోజ్ వాటర్ .. కొద్దిగా

తయారీ విధానం..

పైన చెప్పుకున్న పదార్థాలను అన్నింటిని ఒక కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఒక గాజు బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ సీరమ్ ను జుట్టును పాయలుగా తీసి తల చర్మానికి అప్లై చేయాలి. అనంతరం తేలికపాటి మసాజ్ చేసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలకు భలే సహాయపడుతుంది.

Vitamin-B12: విటమిన్-బి12 సప్లిమెంట్లు వాడుతున్నారా? వీటిని తీసుకోవడానికి సరైన సమయం తెలుసా?


ఉల్లిపాయ సీరమ్..

ఉల్లిపాయ జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే గుణాలు జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. ఉల్లిపాయ సీరమ్ ఎలా చేయాలంటే..

ఉల్లిపాయ రసం.. 2 చెంచాలు

ఆలివ్ ఆయిల్.. 2 చెంచాలు

తేనె.. 1 చెంచా

తయారీ విధానం..

పై పదార్థాలు అన్ని ఒక చిన్న కంటైనర్ లో బాగా మిక్స్ చేసి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు ఇంకేలా పట్టించి తేలికపాటి మసాజ్ చేయాలి. గంట సేపటి తరువాత తలస్నానం చేయాలి. జుట్టు ఆరోగ్యంగా పెరగడమే కాదు.. జుట్టు మెరుస్తుంది కూడా.

Bed Sheet: పరుపు మీద వాడే బెడ్ షీట్లను ఎన్ని రోజులకు ఉతకాలి? చాలా మందికి తెలియని నిజాలివీ..!


ఆముదం, కొబ్బరినూనె..

ఆముదం, కొబ్బరి నూనె ఉపయోగించి తయారు చేసే సీరమ్ జుట్టుకు మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది. దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

ఆముదం.. 2 చెంచాలు

కొబ్బరినూనె.. 2 చెంచాలు

తయారీ విధానం..

ఈ రెండు నూనెలను మిక్స్ చేసి ఒక కంటైనర్ లో భద్రపరుచుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు అంటేలా అప్లై చేసుకోవాలి. అరగంట నుండి గంట సేపు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆముదం జిగటగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా అప్లై చేయకూడదు..

Health Tips: నీళ్లలో పటిక కలుపుకుని స్నానం చేయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!


హెయిర్ సీరమ్ వాడితే కలిగే ఫలితాలు..

  • ఇంట్లో తయారుచేసిన సీరమ్‌లు రసాయన రహితమైనవి, సహజమైన వదార్థాలతో తయారు చేస్తాము. కాబట్టి సురక్షితం.

  • ఇంట్లో తయారు చేసుకునే సీరమ్ లు జుట్టు పొడిబారడాన్ని తొలగిస్తాయి. జుట్టును హైడ్రేట్ గా ఉంచుతాయి.

  • పైన చెప్పుకున్న సీరమ్ లను ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. మార్కెట్లో హెయిర్ సీరమ్ లు చాలా ఖరీదు ఉంటాయి. అందుకే ఇంట్లో హెయిర్ సీరమ్ బెటర్.

  • సీరమ్ లు ఉపయోగిస్తుంటే జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. డ్యామెజ్ అయిన జుట్టు తిరిగి ఆరోగ్యంగా మారుతుంది. హెయిర్ లాస్, హెయిర్ డ్యామెజ్ సమస్యలను నివారిస్తుంది.

  • జుట్టును కాలుష్యం, వాతావరణ పరిస్థితుల నుండి రక్షించడంలో హెయిర్ సీరమ్ సహాయపడతాయి. జుట్టు పెరుగుదలకు మంచి బూస్టింగ్ లా పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి..

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..!

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..!

శరీరంలో ప్రోటీన్ తగ్గిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఈ లక్షణాలతో చెక్ చేసుకోండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 05 , 2024 | 02:30 PM