Hair Health: జుట్టు పలుచగా, బలహీనంగా మారిపోయిందా? అయితే ఈ లోపాలున్నట్టే..!
ABN , Publish Date - May 25 , 2024 | 03:30 PM
ఇప్పటికాలంలో జుట్టు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చిన్నవయసులోనే జుట్టు నెరిసిపోయి ఇబ్బందులు పడుతున్నవారు కొందరైతే.. మరికొందరికి జుట్టు పలుచగా, బలహీనంగా ఉంటోంది. జుట్టు ఇలామారడానికి అసలు కారణాలను వైద్యులు బయటపెట్టారు.
ఇప్పటికాలంలో జుట్టు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చిన్నవయసులోనే జుట్టు నెరిసిపోయి ఇబ్బందులు పడుతున్నవారు కొందరైతే.. మరికొందరికి జుట్టు పలుచగా, బలహీనంగా ఉంటోంది. అయితే కొన్ని పోషకాల లోపం వల్ల జుట్టు ఇలా పలుచగా, బలహీనంగా మారుతుందని హెయిర్ కేర్ నిపుణులు అంటున్నారు. అసలు ఏ పోషకాలు లోపిస్తే జుట్టు పలుచబడుతుంది? తెలుసుకుంటే..
విటమిన్-ఎ, విటమిన్-బి కాంప్లెక్స్ లు, ప్రోటీన్, జింక్ వంటివి జుట్టు పెరుగుదలకు, జుట్టు ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. ఇవి లోపించడం వల్ల జుట్టు పలుచగా, బలహీనంగా మారుతుంది.
వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!
కొందరు విటమిన్లు తీసుకుంటున్నా కూడా జుట్టు పలుచగా , బలహీనంగా ఉందని కంప్లైంట్ చేస్తుంటారు. ఇలాంటి వారిలో కొల్లాజెన్, మిథైల్సల్సోనిల్మీథేన్ లోపిస్తుంది. ఇవి లోపిస్తే జుట్టు బలహీనంగా మారుతుంది.
జుట్టు బలహీనంగా, పలుచగా ఉన్నవారిని బాగా గమనిస్తే చాలావరకు ప్రోటీన్ లోపం తప్పనిసరిగా ఉంటుంది. ఇలాంటి వారికి జుట్టు చాలా వేగంగా రాలడం, బలహీనంగా ఉండటం వంటి సమస్యలు ఉంటాయి.
జుట్టు రాలే సమస్యతోనూ, జుట్టు బలహీనంగానూ ఉన్నవారిలో జింక్ లోపం కూడా ఉంటుంది. జింక్ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.
ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!
వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.