Share News

Almond: రోజూ గుప్పెడు బాదం తింటే..

ABN , Publish Date - Oct 13 , 2024 | 03:04 PM

నిత్యం బాదం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. బాదంను సూపర్‌ఫుడ్ అని పిలుస్తారు.

Almond: రోజూ గుప్పెడు బాదం తింటే..

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం బాదం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. బాదంను సూపర్‌ఫుడ్ అని పిలుస్తారు. దీనిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఇ, ఫైబర్, ప్రొటీన్, ఖనిజాలు చాలా ఉంటాయి. ఇందులో ఉండే మోనోశాకరైడ్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. గుప్పెడు బాదాన్ని మీ డైట్‌లో చేర్చుకుంటే...

చురుగ్గా మెదడు..

నిత్యం కొన్ని బాదం పప్పులను మీ డైట్‌లో చేర్చుకుంటే మెదడు చురుగ్గా మారుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆలోచన సామర్థ్యం, మానసిక స్థైర్యం పెరుగుతుంది.

గుండెకు బలం..

బాదం ఈ కాలంలో ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అందుతాయి. ఇందులోని సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండి, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తుంది.


మెదడు పనితీరు..

బాదంలోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడంట్లు, ఒమేగా 3, ఫ్లాటీ యాసిడ్స్ తో సహా అన్ని పోశకాలు మెదడు పనితీరులో కీలకంగా పనిచేస్తాయి. తెలివి తేటలను పెంచడంలోనూ బాదం మెరుగ్గా పనిచేస్తుంది.

రోగ నిరోధక శక్తి..

బాదంలో ఉండే విటమిన్లు, పోషకాలు జలుబుస ఫ్లూ వంటి లక్షణాలను దూరం చేయడంలో సహకరిస్తుంది. చాలా రకాల వ్యాధులతో పోరాడేందుకు శీతాకాలంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకరిస్తుంది.


బరువు తగ్గడంలోనూ..

క్యాలరీలు ఎక్కువగా ఉన్న బాదాన్ని తీసుకోవడం వల్ల బరువును తగ్గించడంలో సహకరిస్తుంది. బాదంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు సంతృప్తిగా ఉన్నాయి. ఇవి అతిగా తినే అలవాటును తగ్గించడంలో, బ్యాలెన్స్ డైట్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తాయి. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ..

బాదం ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. ఇది జీర్ణ క్రియకు సహకరిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

చర్మం నిగారింపు..

బాదంపప్పులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, చర్మాన్ని నిగారింపుతో, కాంతి వంతంగా ఉంచేందుకు సహకరిస్తాయి. మెరిసే చర్మం కావాలంటే రోజూ నాలుగు నుంచి ఆరు బాదం పప్పులను నీటిలో రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Updated Date - Oct 13 , 2024 | 03:04 PM