Share News

Pupmkin Seeds: గుమ్మడి గింజల్ని రెగ్యులర్‌గా తింటే ఈ సమస్యలు దూరం..

ABN , Publish Date - Nov 04 , 2024 | 06:27 PM

ప్రస్తుత కాలంలో విత్తనాలు, తృణధాన్యాలు చాలామంది తినడానికి ఇష్టపడుతున్నారు. విత్తనాలు శరీరానికి శక్తిని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడుతాయి. ఈ విత్తనాలను పచ్చిగా కాకుండా నానబెట్టి తింటే అనేక లాభాలు ఉంటాయి. అలాంటి విత్తనాల్లో గుమ్మడి గింజలు ఒకటి. గుమ్మడి గింజల్లో. యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ప్రొటీన్లు, పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాల వల్ల ఉపయోగాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గుమ్మడి గింజల వల్ల ఉపయోగాలు:

1. కండరాల పనితీరు:

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి నరాలు, కండరాల పనితీరులో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గుమ్మడి గింజలు కండరాల తిమ్మిరి, కండరాల నొప్పులను నివారిస్తాయి.

2. బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది:

గుమ్మడికాయ గింజలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి . ఇవి భోజనానికి ముందు తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ ఉండి, అతిగా తినడాన్ని నియంత్రిస్తాయి

3. ఆరోగ్యకరమైన కొవ్వులు:

గుమ్మడికాయ గింజలు ఎక్కువ కొవ్వు శరీరానికి అందిస్తాయి. గుమ్మడికాయ గింజల్లోని కొవ్వు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి

4. నిద్రలేమి సమస్య:

నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి గుమ్మడిగింజలు చాలా బాగా ఉపయోగపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

5. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది:

శరీరంలో రోగనిరోధక కణాలు సరిగ్గా పనిచేయడానికి శరీరంలో తగినంత జింక్ అవసరం. గుమ్మడి గింజల్లోని జింక్ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

గుమ్మడి గింజలు ఎప్పుడు తినాలి..

1. ఉదయాన్నే గుమ్మడికాయ గింజలు తినడం వల్ల ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను శరీరానికి అందిస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి

2. గుమ్మడికాయ గింజలను సాయంత్రం అల్పాహారంగా తీసుకుంటే మంచిది. ఇవి తీసుకోవడంలో రాత్రి మంచి నిద్ర అందిస్తోంది

Also Read:

https://www.andhrajyothy.com/2024/navya/health-tips/if-you-dont-have-proper-sleep-do-this-without-resorting-to-sleeping-pills-ssd-spl-1307935.html

https://www.andhrajyothy.com/2024/navya/health-tips/if-migraine-headaches-are-more-common-in-children-then-follow-these-tricks-ssd-spl-1307904.html

Updated Date - Nov 04 , 2024 | 06:27 PM