Health Tips: ఈ మూడు టిప్స్ ఫాలో అయితే చాలు.. ఎంత స్లిమ్ అవుతారంటే..!
ABN , Publish Date - Aug 23 , 2024 | 03:19 PM
సన్నగా నాజుగ్గా ఉండటానికి కఠినమైన వ్యాయామాలు, కఠినమైన డైట్ ఫాలో అయ్యేవారు ఉంటారు. కానీ అవేం అవసరం లేకుండా సన్నగా నాజుగ్గా మారాలంటే కేవలం మూడు టిప్స్ ఫాలో అయితే చాలు.
స్లిమ్ గా మారడం లేదా బరువు తగ్గడం చాలామంది హెల్త్ గోల్స్ లో ఉంటుంది. కొంతమంది సన్నగా నాజూగ్గా ఉంటే ఫ్యాషన్ గా తయారవ్వచ్చని, ప్యాషన్ దుస్తులు వేసుకోవచ్చని అనుకుంటారు. మరికొందరు నాజుగ్గా ఉండటం ఆరోగ్యాన్ని ప్రతి బింబిస్తుందని అనుకుంటారు. అయితే నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా నాజుగ్గా ఉండటం అంత ఈజీ కాదు. సన్నగా నాజుగ్గా ఉండటానికి కఠినమైన వ్యాయామాలు, కఠినమైన డైట్ ఫాలో అయ్యేవారు ఉంటారు. కానీ అవేం అవసరం లేకుండా సన్నగా నాజుగ్గా మారాలంటే కేవలం మూడు టిప్స్ ఫాలో అయితే చాలు. అవేంటో తెలుసుకుంటే..
అవిసె గింజలు తింటే ఆడవాళ్లకు ఎన్ని లాభాలంటే..!
నిమ్మరసం, తేనె..
నిమ్మరసం, తెనే కలిపిన గోరు వెచ్చని నీరు ఉదయాన్నే తీసుకోవడం చాలామంది ఫిట్ నెస్ అలవాట్లలో భాగం. నిమ్మరసం శరీరంలో టాక్సిన్లను బయటకు పంపుతుంది. నిమ్మరసంలోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. తేనె తీపి పదార్థమే అయినా ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసం, తేనెతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
వాల్నట్, బాదం..
వాల్నట్, బాదం మొదలైన డ్రై నట్స్ లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒక వైపు శరీరానికి పోషణను ఇస్తూ మరొకవైపు ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల శరీరం శక్తివంతంగా ఉంటూనే బరువు తగ్గడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు, మెదడుకు చాలా మేలు చేస్తాయి.
ఈ సమస్యలున్న వారు పొరపాటున కూడా నిమ్మరసం తీసుకోకూడదు..!
గ్రీన్ టీ..
గ్రీన్ టీని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా చక్కెర లేదా తేనె వంటివి జోడించకుండా గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో కాసింత నిమ్మరసం కలిపి తాగితే శరీరంలో కేలరీలు తగ్గించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే.. ఈ సమస్యలున్న వారికి భలే లాభాలు..!
గ్రీన్ టీని ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.