5 Super Foods: కోవిడ్ భారిన పడొద్దంటే ఈ 5 ఫుడ్స్ తప్పక తినాల్సిందే..
ABN , Publish Date - Jan 05 , 2024 | 06:38 PM
పోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజూ వందల కొద్ది కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తొలుత ఆల్ఫా B. 1.1. 7గా విజృంభించిన కోవిడ్.. ఆ తరువాత డెల్టాగా రూపాంతరం చెంది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్ది ప్రజలను బలితీసుకుంది. ఇదికాస్తా ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోసారి విజృంభించింది.
Health Tips: పోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజూ వందల కొద్ది కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తొలుత ఆల్ఫా B. 1.1. 7గా విజృంభించిన కోవిడ్.. ఆ తరువాత డెల్టాగా రూపాంతరం చెంది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్ది ప్రజలను బలితీసుకుంది. ఇదికాస్తా ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోసారి విజృంభించింది. ఈసారి ప్రభావం తక్కువగా ఉండటంతో.. హమ్మయ్య ఇక పోయిందిలే అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఈ మహమ్మారి ఎటూ పోలే.. మన మధ్యే ఉంటూ.. తన రంగు, రూపును మార్చుకుంటూ ప్రజలను వెంటాడుతోంది. తాజాగా JN.1 గా రూపాంతరం చెంది ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తోంది. అయితే, ఈ కోవిడ్ వైరస్‌ను తట్టుకోవాలంటే కొన్ని ఆహారాలు ఉపకరిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సూపర్‌ఫుడ్‌లు తీసుకోవడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షింపబడుతుందంటున్నారు. మరి కోవిడ్ జేఎన్.1కి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆ 5 సూపర్ ఫుడ్స్ ఏంటో ఓసారి ఇక్కడ చూద్దాం..
ఆకు కూరలు..
బచ్చలికూర, పాలకూర, కొల్లార్డ్ గ్రీన్స్, స్విస్ చార్డ్ వంటి ఆకు కూరల్లో విటమిన్లు A, C, K తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. COVID-19 వంటి అనారోగ్య సమస్యలతో పోరాడడంలో కీలకంగా ఉంటాయి. అందుకే.. వీటిని అల్పాహారం సమయంలో స్మూతీగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
డ్రైఫ్రూట్స్, గింజలు..
బాదం, పొద్దుతిరుగుడు గింజలు, చియా గింజల్లో విటమిన్ ఇ, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తినడం వలన శరీరానికి బలమైన రోగనిరోధక కణాలను నిర్మించడానికి, వ్యాధులతో పోరాడటానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్‌లను అందిస్తాయి.
సిట్రస్ ఫ్రూట్స్..
నారింజ, ద్రాక్షపండ్లు, నిమ్మకాయలు, బత్తాయిలు.. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. తెల్ల రక్త కణాల కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి. రక్షిత ప్రతిరోధకాల ఉత్పత్తిని పెంచుతుంది. దెబ్బతిన్న కణజాలాలను సరిచేయడానికి సహాయపడుతుంది. వాటర్ కలిపి గానీ, జ్యూస్, సలాడ్ రూపంలో సిట్రస్ పళ్లను తినొచ్చు.
ప్రోబయోటిక్స్..
పెరుగు, కిమ్చి, మిసో, కొంబుచాలో ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గట్ సామర్థ్యాన్ని పెంచుతాయి వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పని చేస్తాయి. జీర్ణక్రియ, పోషకాల శోషణను మెరుగుపరచడమే కాకుండా.. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పని చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
అల్లం, వెల్లుల్లి..
వెల్లుల్లి, అల్లం ఆయుర్వేద పరంగా మంచి ఔషధాలు. వీటిలోని గుణాలు.. వ్యక్తి రోగాల భారిన పడకుండా కాపాడుతుంది. యాంటీవైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉన్నాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రోగ నిరోధక కణాల కార్యకలాపాలను పెంచుతుంది. అల్లం లోని జింజెరాల్ కడుపులో మంటను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.