Health Tips: నీళ్లలో పటిక కలుపుకుని స్నానం చేయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!
ABN , Publish Date - Oct 02 , 2024 | 06:52 PM
ఆయుర్వేదంలో చాలా రకాలుగా ఉపయోగించే పటిక గురించి చాలా మందికి నిజాలు తెలియవు. పటికను నీటిలో వేసి స్నానం చేస్తే జరిగేదిదే..
పటిక అనేది పారదర్శక పదార్థం. ఇది ముద్దగా ఉప్పును పోలి ఉంటుంది. దీనిని ఔషదంగా భావిస్తారు. ఆయుర్వేదంలో పటికను కొన్ని రకాల సమస్యలకు వైద్యం చేయడంలో వాడతారు. అయితే పటికను నీటిలో కలిపి స్నానం చేస్తారని చాలా మందికి తెలియదు. ఔషద గుణాలున్న పటికను నీటిలో కలిపి స్నానం చేస్తుంటే కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..
అలసట..
పటికను నీటిలో కలిపి స్నానం చేస్తుంటే అలసట తగ్గుతుంది. రోజంతా పని చేసి బాగా అలసటకు లోనైనవారు నీటిలో పటిక వేసి స్నానం చేస్తే అలసట మొత్తం మంత్రించినట్టు మాయమవుతుంది. శరీరంలో నొప్పిగా ఉన్నా, ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తున్నా గోరువెచ్చని నీటిలో పటిక కలుపుకుని స్నానం చేయాలి. అంతేకాదు.. నీటిలో పటికను వేసి ఆ నీటిలో పాదాలను నానబెట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
Pineapple: పైనాపిల్ గురించి అవాక్కయ్యే నిజాలు.. తియ్యగా ఉన్న పైనాపిల్ ఎలా సెలెక్ట్ చెయ్యాలంటే..!
చర్మం..
ఈ కాలంలో చాలామంది చిన్న వయసులోనే చర్మం ముడుతలు పడి ఎక్కువ వయసున్న వారిలాగా కనిపిస్తుంటారు. అయితే పటికను నీటిలో వేసి స్నానం చేస్తుంటే చర్మం బిగుతుగా మారుతుంది. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
వాసన..
చెమట, కాలుష్యం కారణంగా శరీరం దుర్వాసన వస్తుంటుంది. పటికను నీటిలో కలిపి స్నానం చేస్తుంటే ఈ దుర్వాసన తగ్గుతుంది. పటికలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరం నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.
మార్భర్గ్ వైరస్.. కరోనా, మంకీ పాక్స్ కంటే ఇదెంత డేంజరంటే..!
వాపు..
శరీరంలో వాపులు, నొప్పులతో ఇబ్బంది పడేవారు పటిక నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు. చర్మం చికాకులు, చర్మం ఎర్రబారడం, చర్మం మంట మొదలైనవి పటిక నీటి స్నానం వల్ల తగ్గుతాయి.
ఎలా స్నానం చేయాలి?
ఒక బకెట్ లో గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. ఈ నీటిలో ఒకటి నుండి రెండు స్పూన్ల పటిక పొడిని కలపాలి. నీటిని బాగా కలిపిన తరువాత పటిక మిశ్రమం బాగా కరిగిపోయిన తరువాత ఈ నీటితో స్నానం చేయాలి. పటిక పూర్తీగా కరిగిన తరువాత స్నానం చేస్తే పటికలో గుణాలు శరీరానికి బాగా అందుతాయి.
ఇవి కూడా చదవండి..
10గ్రాముల బంగారం ధర లక్ష దాటుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.