Share News

Health Tips: 30 ఏళ్లు దాటిన మగవారికి బెండకాయ నీరు చేసే మేలు ఎంతంటే..!

ABN , Publish Date - Jun 25 , 2024 | 05:02 PM

30ఏళ్లు నిండిన మగవారికి మాత్రం బెండకాయ నీరు వల్ల బోలెడు లాభాలుంటాయట. అసలు బెండకాయ నీరు ఎలా తయారుచేస్తారు? 30 ఏళ్లు నిండిన వారికి ఈ నీరు తాగడం వల్ల కలిగే మేలు ఏంటి?

Health Tips: 30 ఏళ్లు దాటిన మగవారికి బెండకాయ నీరు చేసే మేలు ఎంతంటే..!

బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయి అనేది ప్రతి భారతీయ తల్లి తమ పిల్లలకు చెప్పే మాట. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే 30ఏళ్లు నిండిన మగవారికి మాత్రం బెండకాయ నీరు వల్ల బోలెడు లాభాలుంటాయట. అసలు బెండకాయ నీరు ఎలా తయారుచేస్తారు? 30 ఏళ్లు నిండిన వారికి ఈ నీరు తాగడం వల్ల కలిగే మేలు ఏంటి? తెలుసుకుంటే..

బెండకాయలో బోలెడు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిలో మాంగనీస్, విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్ సహా అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!


బెండకాయలను ముక్కలుగా కోసి నీటిలో 24 గంటల పాటూ నానబెడతారు. తరువాత బెండకాయలు తొలగించి ఈ నీటిని తాగుతారు. ఇవే బెండకాయ నీరు. ఈ నీటిని తాగడం వల్ల 30ఏళ్లు నిండిన మగవారికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బెండకాయను ఉడికించి లేదా వేయించి ఆహారంలో భాగంగా తీసుకోవడమే కాకుండా బెండకాలను నీటిలో నానబెట్టి ఈ నీటిని తీసుకోవచ్చు. ఈ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీర్ఘకాలిక మధుమేహాన్నితగ్గించడానికి ఇది సహాయపడుతుంది. బెండకాయలలో ఉండే డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో కలిపి జీవక్రియను ప్రోత్సహిస్తుంది. కండరాల ద్వారా చక్కెర శోషణను పెంచుతుంది. తద్వారా రక్తంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!


బెండకాయను ఆహారంలో భాగంగా తీసుకున్నా, బెండకాయ నీటిని తాగినా గుండెకు చాలా మేలు చేస్తుంది. 30ఏళ్లు నిండిన మగవారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో బెండకాయ నరు బాగా పనచేస్తుంది.

బెండకాయ జీర్ణక్రియను బలపరుస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం సమస్య తగ్గుతుంది. దీంట్లో విటమిన్-ఎ, సి సమృద్దిగా ఉంటాయి. ఇది ఒత్తిడిని, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలోనూ, చర్మం పొడిబారకుండా ఉండటంలోనూ, చర్మం మీద ముడుతలు తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 25 , 2024 | 05:02 PM