Health Tips: బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నారా? అదిరిపోయే న్యూస్ మీకోసమే..!
ABN , Publish Date - Aug 25 , 2024 | 01:32 PM
Health Tips: బ్యాక్ పెయిన్ అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి మెడిసిన్స్ అన్నీ వాడుతుంటారు. అయితే, ఇవేవీ లేకుండానే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలిగించే..
Health Tips: బ్యాక్ పెయిన్ అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి మెడిసిన్స్ అన్నీ వాడుతుంటారు. అయితే, ఇవేవీ లేకుండానే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలిగించే అనేక రకాల ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ-కామర్స్ సైట్‌లలో ఈ గ్యాడ్జెట్‌లు అందుబాటులో ధరల్లోనే లభ్యమవుతున్నాయి. ఈ గాడ్జెట్‌ల ద్వారా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకావం ఉంటుంది.
టెన్స్ మెషీన్..
ఇది తేలికపాటి విద్యుత్ పల్స్ ద్వారా నరాలను ఉత్తేజపరిచే విద్యుత్ పరికరం. ఇది నొప్పిని తగ్గిస్తుంది. దీనిని ఇంట్లోనే సులభంగా ఉపయోగించవచ్చు. ఇది చాలా సురక్షితమైనది కూడా.
హీట్/కూల్ ప్యాడ్స్..
హీటింగ్/కూలింగ్ ప్యాడ్‌లు కండరాలకు విశ్రాంతినిస్తాయి. నొప్పి, దృఢత్వాన్ని తగ్గిస్తాయి. దీనిని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
పోర్టబుల్ మసాజ్ గన్..
మసాజ్ గన్ పోర్టబుల్ పరికరం. వేగవంతమైన కంపనాల ద్వారా కండరాలను సడలింపజేస్తుంది. నొప్పి, ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిని మన సౌలభ్యం ప్రకారం సెట్ చేసుకోవచ్చు. కండరాల అలసట, నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
ఇన్‌ఫ్రా రెడ్ లైట్ ట్రీట్‌మెంట్..
ఇన్‌ఫ్రారెడ్ లైట్ థెరపీ కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇన్‌ఫ్రారెడ్ లైట్ ఉపయోగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. వాపును తగ్గిస్తుంది. నొప్పి ఉన్న ప్రదేశాలలో దీనిని ఉపయోగిస్తే.. ఉపశమనం కలుగుతుంది. ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.
పోశ్చర్ కరెక్షన్ బెల్ట్..
నడుము, వెన్నెముకను సరైన స్థితిలో ఉంచడంలో ఈ బెల్ట్ సహాయపడుతుంది. తప్పుడు భంగిమ వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తుంది. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చునే లేదా పని చేసే వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఫిజియోథెరపీ కుషన్..
ఈ కుషన్లు నడుము, వెన్నెముకకు సపోర్ట్‌గా ఉంటాయి. మీ నడుము భంగిమను సరిగ్గా ఉంచుతాయి. ఇది ఆఫీస్ కుర్చీ, కారులో ఉపయోగించవచ్చు. ఇది వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
చైనీస్ బయోమాగ్నెటిక్ బెల్ట్..
ఈ బెల్ట్ కండరాలను సడలించడం, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడే అయస్కాంతాలను కలిగి ఉంటుంది. దీన్ని రెగ్యులర్‌గా వేసుకోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది.
వైబ్రేటింగ్ మసాజ్ కుషన్..
ఈ కుషన్ కండరాలను సడలించే, నొప్పిని తగ్గించే వైబ్రేటింగ్ మసాజ్‌ని అందిస్తుంది. ఇది ఆఫీసులో లేదా ఇంట్లో సోఫాలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు.
ఈ గాడ్జెట్‌లు వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. బామ్స్, ఆయింట్‌మెంట్ల అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా నొప్పి తీవ్రంగా ఉంటే వైద్యుడిని గానీ ఫిజియోథెరపిస్ట్‌ను గానీ సంప్రదించడం ఉత్తమం.