Healthy Juices: ఈ జ్యూస్ లు తాగితే చాలు.. జుట్టు రాలడం మంత్రించినట్టు ఆగిపోతుంది..!
ABN , Publish Date - Jul 10 , 2024 | 12:35 PM
నేటికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు అన్ని వయసుల వారు ఎదుర్కొంటున్నారు. జీవనశైలి, తీసుకునే ఆహారం, వాతావరణ కాలుష్యం ఇవన్నీ జుట్టు రాలే సమస్యకు కారణం అవుతాయి. ఇక మహిళలలో అయితే హార్మోన్ల అసమతుల్యత ఎలాగూ ఉండనే ఉంటుంది. జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడానికి..
నేటికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు అన్ని వయసుల వారు ఎదుర్కొంటున్నారు. జీవనశైలి, తీసుకునే ఆహారం, వాతావరణ కాలుష్యం ఇవన్నీ జుట్టు రాలే సమస్యకు కారణం అవుతాయి. ఇక మహిళలలో అయితే హార్మోన్ల అసమతుల్యత ఎలాగూ ఉండనే ఉంటుంది. జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడానికి చాలామంది షాంపూలు, నూనెలు, కండీషనర్ లు ఉపయోగిస్తుంటారు. కానీ ఈ కింది జ్యూస్ లు తాగుతూ ఉంటే చాలు.. జుట్టు రాలే సమస్య మంత్రించినట్టు ఆగిపోతుంది. అవేంటో తెలుసుకుంటే..
క్యారెట్ జ్యూస్..
క్యారెట్ జ్యూస్ తాగితే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. క్యారెట్ జ్యూస్ లో విటమిన్-ఎ, బీటా కెరొటిన్, బయోటిన్ ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో, జుట్టు రాలడాన్ని అరికట్టడంలో సహాయపడతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏం జరుగుతుందంటే..!
పాలకూర జ్యూస్..
పాలకూర జ్యూస్ లో ఐరన్, విటమిన్-ఎ, సి వంటివి ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడంలో జుట్టు విరిగిపోకుండా చేయడంలో సహాయపడతాయి.
ఉసిరి..
ఉసిరి కాయ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలోనూ, జుట్టు రాలడాన్ని అరికట్టడంలోనూ సహాయపడుతుంది.
అలొవేరా జ్యూస్..
అలోవేరా జ్యూస్ లో ఉండే ఎంజైమ్లు మృత స్కాల్ప్ సెల్ లను తొలగించడంలోనూ, జుట్టు రాలడాన్ని నివారించడంలోనూ సహాయపడతాయి.
5ఏళ్ల లోపు పిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి..!
కాకరకాయ జ్యూస్..
కాకరకాయ జ్యూస్ చేదుగా ఉన్నా పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ, సి సమృద్దిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
నారింజ జ్యూస్..
ఆరెంజ్ లేదా నారింజ జ్యూస్ లో మంచి మొత్తంలో విటమిన్-సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ను పెంచడంలోనూ, జుట్టు రాలడాన్ని నివారించడంలోనూ సహాయపడుతుంది.
5ఏళ్ల లోపు పిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి..!
ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.