High BP: రక్తపోటు పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? హై బీపీని ఎందుకు ప్రమాదకరంగా పరిగణిస్తారంటే..!
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:48 PM
అధిక రక్తపోటు చాలామంది ప్రధాన సమస్యగా ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అయితే
రక్తపోటు ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుంది. అయితే ఇది కొందరిలో ఎక్కువ, తక్కువ అవుతూ ఉంటుంది. అధిక రక్తపోటు చాలామంది ప్రధాన సమస్యగా ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అసలు రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? రక్తపోటు పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? అధిక రక్తపోటును ప్రమాదకరంగా ఎందుకు పరిగణిస్తారు? తెలుసుకుంటే..
Hair Oil: ఉల్లిపాయ నూనె లేదా వెల్లుల్లి నూనె.. జుట్టు మందంగా, ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె మంచిదంటే..!
రక్తపోటు పెరిగినప్పుడు జరిగేదిదే..
అనూరిజం..
శరీరంలో రక్తపోటు పెరగడం వల్ల కణాలు బలహీనపడతాయి. ఇలా బలహీనపడిన కణాలు అనూరిజం రూపాన్ని తీసుకుంటాయి. అనూరిజంలో ధమనులు ఉబ్బుతాయి. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ప్రమాదకరంగా కూడా మారవచ్చు.
గుండె వైఫల్యం..
అధిక రక్తపోటు కణాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీని కారణంగా గుండె కండరాలు బరువుగా మారతాయి. ఈ సందర్భంలో శరీర అవసరాలకు అనుగుణంగా రక్త ప్రసరణ జరగదు. ఇది గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది.
గుండెపోటు..
శరీరంలో అధిక రక్తపోటు కారణంగా కణాలు గట్టిగా మందంగా మారుతాయి, ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ఇది ఇతర గుండె సమస్యలను కూడా కలిగిస్తుంది.
Rose Water: రోజ్ వాటర్ ను ఇలా వాడి చూడండి.. డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
మెదడు సంబంధిత సమస్యలు..
శరీరంలో రక్తపోటు నియంత్రణలో లేనప్పుడు, అది ఆలోచించే, నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు కూడా రావచ్చు.
అధిక రక్తపోటు ఎందుకు ప్రమాదం?
పైన చెప్పుకున్న కారణాలు అన్నీ గుండెను, మెదడును ప్రభావితం చేసేవే. అంటే అధిక రక్తపోటు వల్ల ప్రాణానికి ప్రమాదం ఎక్కువ. అధిక రక్తపోటు తగ్గించుకోవడానికి, నియంత్రణలో ఉండటానికి జీవనశైలిని మార్చుకోవాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
Banana: రోజూ ఒక అరటిపండును నెల రోజులు వరుసగా తినండి.. ఈ వ్యాధులన్నీ మాయం..!
Health Tips: కాళ్లు చేతులలో జలదరింపు వస్తుందా? అసలు కారణం ఇదే..!
100 Times Washed Ghee: శత ధౌత ఘృత లేదా 100సార్లు కడిగిన నెయ్యి.. దీని బెనిఫిట్స్ ఏంటంటే.. !
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.