Home Cleaning: వ్యాధులనేవి ఇంటి దరిదాపుల్లో ఉండకూడదంటే.. ఇంటిని ఈ టిప్స్ తో శుభ్రం చెయ్యాల్సిందే..!
ABN , Publish Date - Jan 25 , 2024 | 12:41 PM
ఇంటి వాతావరణం శుభ్రంగా, తాజాగా ఉండాలన్నా.. జబ్బులనే మాట ఇంట్లో వినపడకూడదన్నా ఈ టిప్స్ ఉపయోగించి ఇంటిని శుభ్రం చెయ్యాల్సిందే.
ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం, అలవాట్లే కాదు.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. ఇప్పటి బిజీ జీవితాలలో చాలామంది ఇంటి శుభ్రత మీద తగిన జాగ్రత్తలు తీసుకోరు. కొందరు పనిమనుషులను పెట్టుకుంటారు. కానీ పనిమనిషి లేకుండా ఉండే వారి పరిస్థితి చాలా అద్వానంగా ఉంటుంది. ఇక చిన్న పిల్లలు ఉన్న ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. ఇంటి వాతావరణం శుభ్రంగా, తాజాగా ఉండాలన్నా.. జబ్బులనే మాట ఇంట్లో వినపడకూడదన్నా ఈ టిప్స్ ఉపయోగించి ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
వంటగది స్పాంజులు..
సాధారణంగా వంటగదిలో స్టవ్, కౌంటర్, సింక్ మొదలైనవి శుభ్రం చేయడానికి స్పాంజ్ ఉపయోగిస్తుంటారు. ఇవి బ్యాక్టీరియాలకు నిలయంగా ఉంటాయి. ఈ స్పాంజులు కూడా శుభ్రంగా ఉండటం ముఖ్యం. ఇందుకోసం వెనిగర్ కలిపిన నీటిలో స్పాంజులను 15నిమిషాలు ఉంచి ఆ తరువాత పిండేసి గాలిలో బాగా ఆరబెట్టాలి.
ఇది కూడా చదవండి: అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు.. రోజంతా రేసుగుర్రం లెక్క చురుగ్గా ఉంటారు!
సింక్..
వంటగదిలో చాలా వ్యర్థాలు సింకులోకి వెళుతుంటాయి. సింకు పైపులు సరిగా ఉంచుకోకపోతే అది వంటగది వాతావరణం మొత్తాన్ని పాడుచేస్తుంది. దుర్గంధం వెధజల్లుతుంది. నెలకొకసారి సింకు పైపులు శుభ్రం చేయడం వల్ల ఉన్నట్టుండి పైపులు బ్లాక్ అయ్యే పరిస్థితి కూడా నివారించవచ్చు. ఒక కప్పు వెనిగర్, ఒక కప్పు బేకింగ్ సోడాను సింకు పైపు దగ్గర పోయాలి. 10నిమిషాల తరువాత వేడి నీటిని పోయాలి. ఇది చక్కగా పనిచేస్తుంది.
ఫ్రిజ్ ను శుభ్రంగా ఉంచాలి..
చాలా ఆహార పదార్థాలు, కూరగాయలు ఫ్రిజ్ లో నిల్వచేస్తారు. రిఫ్రిజిరేటర్ తాజాగా ఉంటే లోపలి పదార్థాలు కూడా శుభ్రంగా ఉంటాయి. వెనిగర్ కలిపిన నీటని స్ప్రే చేసి ఫ్రిజ్ ను శుభ్రం చేస్తే ఫ్రిజ్ దుర్వాసన పోతుంది.
కటింగ్ బోర్డులు..
కటింగ్ బోర్డులు ప్లాస్టిక్, చెక్కతో తయారుచేయబడి ఉంటాయి. వీటిని సరిగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా దారుణంగా తయారవుతుంది. వీటిని కూడా వెనిగర్ స్ప్రే చేసి జాగ్రత్తగా శుభ్రం చెయ్యాలి. గాలికి బాగా ఆరేలా ఉంచాలి.
ఇది కూడా చదవండి: జాగ్రత్త.. ఈ ఆహారాలు తింటే యూరిక్ యాసిడ్ పెరగడంతో పాటూ బోలెడు రోగాలు వస్తాయ్!
టాయ్లెట్..
ఇంటిని శుభ్రం చేసుకున్నంత శ్రద్ద చాలామందికి టాయ్లెట్లు శుభ్రం చేయడం మీద ఉండదు. వెనిగర్, బేకింగ్ సోడా ఉపయోగించి టాయ్లెట్ ను సులభంగానే క్లీన్ చేయవచ్చు. బాత్రూమ్లో పేరుకున్న అచ్చు, బూజు, బ్యాక్టీరియా అన్నింటిని ఇది తొలగిస్తుంది. దుర్వాసన కూడా తగ్గుతుంది.
విడిచిన దుస్తులు..
విడిచిన దుస్తులను కుప్పలు కుప్పలుగా పేర్చడం మాని ఎప్పటి దుస్తులు అప్పుడు ఉతికేయడం బెస్ట్. అంతేకాదు విడిచిన బట్టలను ఎక్కడంటే అక్కడ వేయకుండా ఒకచోట పెట్టడం మంచిది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.