Share News

Ice Apple: వేసవిలో ఊరించే తాటిముంజలు చలువ చేయడమే కాదు.. దీంతో ఇంకా ఎన్ని లాభాలంటే..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:43 PM

భారతీయులకు తాటిముంజలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. ఇవి శరీరానికి చలువ చేయడమే కాదు.. ఇంకా బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.

Ice Apple: వేసవిలో ఊరించే తాటిముంజలు చలువ చేయడమే కాదు.. దీంతో ఇంకా ఎన్ని లాభాలంటే..!

వేసవికాలం వస్తే అమ్మో అంటాం కానీ.. అది తీసుకొచ్చే రుచులను మూత్రం లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తాం. మామిడిపళ్లు, తాటిముంజలు, చెరకురసం, కర్భూజా, పుచ్చకాయ.. ఇలా ఆస్వాదించడానికి చాలా ఉంటాయి. ముఖ్యంగా తాటిముంజలు తియ్యగా, నీరుతో కూడి చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ఇవి వేసవి తాపాన్ని చాలా ఈజీగా తగ్గిస్తాయి. ఇందులో ఉండే నీళ్లు కొబ్బరి నీళ్లను తలపిస్తాయి. భారతీయులకు తాటిముంజల గురించి తెలియకపోవడం అంటూ ఉండదు. వేసవిలో అందరినీ అలరించే తాటిముంజలు శరీరానికి చలువ చేయడమే కాదు.. ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. అవేంటో తెలుసుకుంటే..

పోషకాలు..

తాటిముంజలలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-ఇ, విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: దంతాల మీద ఎర్రగా గార పేరుకుపోయిందా? ఈ టిప్స్ తో వదిలించుకోవచ్చు..!


హైడ్రేట్..

తాటిముంజలు తింటే వేసవి తాపం తీరుతుందని అందరికీ తెలిసిందే. వేసవిలో వీటిని తింటే శరీరానికి చలువ చేస్తుంది. ఎండల వల్ల శరీరంలో ఏర్పడిన వేడి తగ్గుతుంది. తాటిముంజను నేరుగా తినడమే కాకుండా జ్యూస్ గానూ వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్నారు.

రోగనిరోధక వ్యవస్థ..

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. వ్యాధులకు దూరంగా ఉండచ్చు. దీనికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు తాటిముంజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి.

జీర్ణసమస్యలు..

అసిడిటీ, కడుపులో మంట, కడుపులో అల్సర్లు మొదలైన కడుపుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో తాటిముంజలు ముందువరుసలో ఉంటాయి. జీర్ణసమస్యలను తగ్గంచడంలోనూ సహాయపడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఎదురయ్యే జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తాయి.

బరువు..

ఇప్పటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య అధికబరువు. బరువు నియంత్రణలో ఉంచుకోవాలని చాలామంది అనుకుంటారు. తాటిముంజలలో నీరు ఎక్కువ, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కేలరీలు తక్కువ. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 01:43 PM