Share News

Gongura Benifits: షుగర్ ఉన్న వారు గోంగూర తింటే..

ABN , Publish Date - Sep 09 , 2024 | 02:44 PM

తెలుగు రాష్ట్రాల్లో గోంగూరది ప్రత్యేక స్థానం. ఈ ఆకుకూరను ఏపీలో గోంగూర(Gongura Benifits) అని పిలుస్తుండగా.. తెలంగాణ జిల్లాల్లో పుంటి కూర అంటుంటారు.

Gongura Benifits: షుగర్ ఉన్న వారు గోంగూర తింటే..

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గోంగూరది ప్రత్యేక స్థానం. ఈ ఆకుకూరను ఏపీలో గోంగూర(Gongura Benifits) అని పిలుస్తుండగా.. తెలంగాణ జిల్లాల్లో పుంటి కూర అంటుంటారు. పేరేదైనా ఇందులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. గోంగూర తినడం వల్ల చాలా ఆరోగ్యలాభాలు ఉన్నాయి. అందుకే దీన్ని తేలిగ్గా తీసిపారేయకూడదు. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుందని అంటున్నారు వైద్యులు. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి2, బి9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు కంటి చూపును కాపాడటంతోపాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. విటమిన్లతోపాటు పొటాషియం, ఇనుము వంటి పోషకాలు ఉంటాయి.


అందుకే వీటిని పిల్లలు, పెద్దలూ అందరూ తింటే చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు దీన్ని తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది, చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అందుకే గోంగూర పచ్చడి, గోంగూర రైస్, గోంగూర పప్పు వంటివి తింటుండాలి. వారానికి కనీసం రెండు సార్లు తింటే షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. పళ్ల సమస్యలున్న వారికి గోంగూర మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలకు కూడా పుంటికూర మంచిదే.


గుండె వ్యాధులకు చెక్..

గోంగూర గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెడుతుంది. కంటిచూపును మెరుగుపరచడంలో సాయపడుతుంది. రేచీకటి ఉన్న వారు దీన్ని తింటే సమస్య తగ్గుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ముల సమస్య ఉన్నవారు తీసుకున్నా చాలా మంచిది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ నుంచి కాపాడతాయి. పుంటికూరలో ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి గర్భిణులు తీసుకోవడం చాలా ముఖ్యం.

సైడ్ ఎఫెక్ట్స్..

అయితే గోంగూర కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్‌కు దారి తీస్తుంది. కొందరి శరీర స్వభావం వల్ల గోంగూర పడదు. అయితే మీ శరీరంపై సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతేనే పుంటికూరను తీసుకోవడం ముఖ్యం. పడకపోతే దానికి దూరంగా ఉండటమే మంచిది.

For Latest News and National News Click Here

Updated Date - Sep 09 , 2024 | 02:55 PM