Joint Pains: చలికాలంలో కీళ్లనొప్పులను ఈజీగా తగ్గించే 5 అసనాలు ఇవీ..!
ABN , Publish Date - Jan 08 , 2024 | 03:31 PM
చలికాలంలో శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆసనాలతో కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టవచ్చు.
చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, ప్లూ వంటి సీజనల్ సమస్యలే కాదు.. ఎముకలు కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. చలికాలంలో శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కీళ్ళ నొప్పులను అధిగమించడానికి చాలా ఈజీగా వేసే ఆసనాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే అసలు కీళ్ల నొప్పి అనే ప్రస్తావనే రాదు.
హస్త ఉత్తనాసనం..
చలికాలంలో చాలామంది శరీరం పై భాగంలో ఎక్కువ చలిని అనుభూతి చెందుతారు. దీనికి చెక్ పెట్టడానికి
హస్త ఉత్తనాసనం బాగా పనిచేస్తుంది. కేవలం వెచ్చదనాన్ని ఇవ్వడమే కాదు.. ఒత్తిడి తగ్గించి ఛాతీ, భుజాలలో మెరుగైన రక్తప్రసరణకు ఇది సహాయపడుతుంది.
ఎలా చేయాలంటే..
నిటారుగా నిలబడి ప్రార్థిస్తున్నట్టు చేతులు రెండూ కలిపి నమస్కార భంగిమలోకి తేవాలి.
రెండు చేతులను పైకి లేపి వీపును కొద్దిగా వెనక్కు వంచి పైకి చూడాలి. ఈ సమయంలో లోతుగా శ్వాస పీల్చుకోవాలి.
చేతులు రెండూ చెవులను తాకేలా తీసుకొచ్చి తుంటి భాగాన్ని ముందుకు నెట్టాలి.
ఇదే భంగిమలో శ్వాసను నిలిపినంత సేపు ఉండాలి. ఆ తరువాత శ్వాసను మెల్లిగా వదులుతూ తిరిగి చేతులను నమస్కారం భంగిమలోకి తీసుకురావాలి.
ఇది కూడా చదవండి: జుట్టు బాగా రాలిపోతోందా? ఈ నూనెలు వాడితే మ్యాజిక్కే!
మార్జాలాసనం..
చలికాలంలో వెన్నెముక దృఢంగా మారడానికి, రక్తప్రసరణ మెరుగవ్వడానికి మార్జాలాసనం సహాయపడుతుంది.
ఎలా చేయాలంటే..
మొదట వజ్రాసనంలో కూర్చోవాలి. ఆ తరువాత శరీరాన్ని ముందుకు వంచుతూ అరచేతులు నేలకు ఆనించాలి. ఈ పొజిషన్లో అరచేతులు భుజాలకు, మోకాళ్లు తుంటి భాగానికి సమాంతంగా ఉండాలి.
ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ నడుము భాగాన్ి వీలైనంతగా పైకి తీసుకురావాలి. ఆ తరువాత తలను కిందకు దించాలి. ఇలాగే కొద్దిసేపు ఉండాలి. ఆ తరువాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తిరిగి నడుమును కిందకు వంచాలి.
ఇది కూడా చదవండి: ఏలకుల పాలకు ఇంత శక్తి ఉందా? రాత్రి పడుకునేముందు తాగితే జరిగేదిదీ..!
అదో ముఖ స్వనాశనం..
దీన్నే డాగ్ పోజ్ అని అంటారు. ఇది తలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వీపు, భుజాలలో దృఢత్వం పెంచుతుంది. కాళ్లు, చేతులను బలపరుస్తుంది.
ఎలా చేయాలంటే..
ఈ ఆసనం వేయడానికి మొదట బోర్లా నేలపై పడుకోవాలి. రెండు అరచేతులను, పాదాల వేళ్ళను భూమికి గట్టిగా నొక్కి పట్టాలి.
శరీర బరువును అరచేతులు, పాదాలవేళ్ల మీద మోపి మెల్లగా శరీరంలో ఒక్కో భాగాన్ని పైకి లేపుతూ V ఆకారంలోకి శరీరాన్ని తీసుకురావాలి.
ఈ భంగిమలో చేతులు భుజాలు వెడల్పుగా ఉండాలి. ఈ భంగిమలో లోతైన శ్వాస తీసుకోవాలి. 30సెకెన్ల పాటు ఇలా ఉంచి ఆ తరువాత తిరిగి సాధారణ స్థితికి శరీరాన్ని మెల్లగా తీసుకురావాలి.
ఇది కూడా చదవండి: అల్పాహారంగా మొలకలు తింటే కలిగే షాకింగ్ ఫలితాలివీ..!
సేతు బంధాసనం..
చలికాలంలో వెన్నునొప్పి ఉన్నవారికి, సేతు బంధాసనం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇది వెన్నెముకను లోతుగా అనుసంధానమై ఉంటుంది. చలికి బిగుసుకుపోయిన ఛాతీని తిరిగి రిలాక్స్ గా చేస్తుంది.
ఎలా వేయాలంటే..
ఈ ఆసనం వేయడానికి వెల్లికిలా పడుకోవాలి. మోకాళ్లను వంచి పాదలను పిరుదులకు సమాంతరంగా ఉండేలా తీసుకురావాలి.
తల కాళ్ల మధ్య V ఆకారం వచ్చే భంగిమలోకి రావాలి.
చేతులను వెనుక నుంచి శరీరం కింద భాగంలో నేలకు ఆనించాలి. అరచేతులతో బలాన్ని ఉపయోగించి భుజాలు, ఛాతీలని మెల్లగా పైకి లేపాలి.
ఛాతీ భాగం నుండి మోకాళ్ల వరకు సమాంతరంగా ఉండేలా చూడాలి. ఇది వంతెనలాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని సేతు బందాసనం అంటారు.
ఇది కూడా చదవండి: Eye Sight: ఈ 5 ఆహారాలు ట్రై చేశారంటే కళ్లజోడు అవసరమే ఉండదు.. డేగలాంటి చూపు ఖాయం!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చెయ్యండి.