Share News

Kidney Cancer: ఈ తప్పులు చేయడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వస్తుందట.. ఇంతకీ అవేంటంటే..!

ABN , Publish Date - Jun 20 , 2024 | 01:04 PM

మూత్రపిండాలు మానవ శరీరంలో వడపోత పరికరాల లాగా పనిచేస్తాయి. ఇవి ప్రతిరోజూ 200లీటర్ల రక్తాన్ని వడపోసి 2లీటర్ల వరకు వ్యర్థాలను, శరీరంలో అదనపు నీటిని బయటకు పంపుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలోనూ, శరీరంలోనూ కలుషితాలు అలాగే ఉంటాయి. ఇవి అనేక రకాల వ్యాధులకు కారణం అవుతాయి.

Kidney Cancer:  ఈ తప్పులు చేయడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వస్తుందట.. ఇంతకీ అవేంటంటే..!

మూత్రపిండాలు మానవ శరీరంలో వడపోత పరికరాల లాగా పనిచేస్తాయి. ఇవి ప్రతిరోజూ 200లీటర్ల రక్తాన్ని వడపోసి 2లీటర్ల వరకు వ్యర్థాలను, శరీరంలో అదనపు నీటిని బయటకు పంపుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలోనూ, శరీరంలోనూ కలుషితాలు అలాగే ఉంటాయి. ఇవి అనేక రకాల వ్యాధులకు కారణం అవుతాయి. ఇప్పటి కాలంలో కిడ్నీలకు సంబంధించిన సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. రోజువారీ జీవితంలో చేస్తున్న తప్పుల వల్లే కిడ్నీలు పాడవుతున్నాయని, కిడ్నీ క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తున్నాయని అంటున్నారు వైద్యులు. ఇంతకీ చాలామంది చేస్తున్న ఆ తప్పులు ఏంటో తెలుసుకుంటే..

ధూమపానం..

ధూమపానం చేసేవారికి మూత్రపిండాలలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ధూమపానం తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.

ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!


అధిక రక్తపోటు..

అధిక రక్తపోటుకు మూత్రపిండ క్యాన్సర్ కు మధ్య సంబంధం ఏంటని చాలామందికి అనిపిస్తుంది. కానీ అధిక రక్తపోటు కారణంగా మూత్రపిండాలలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయని వైద్యులు అంటున్నారు. దీనికి సంబంధించిన పలు ఆధారాలు కూడా వైద్యులు చూపిస్తున్నారు.

ఊబకాయం..

అధిక శరీర బరువుతో ఇబ్బంది పడే వారికి కిడ్నీ క్యాన్సర్ కు సంబంధం కలిగి ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో మూత్రపిండ క్యాన్సర్ కణాలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్..

కాడ్మియం, ఆస్బెస్టాస్, పెట్రోలియం ఉత్పత్తులకు ఎక్స్పోజర్ అయ్యే వారిలో మూత్రపిండ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువ.

జామ ఆకుల కషాయం తాగితే జరిగే మేలు ఎంతంటే..!


అనాల్జెసిక్స్..

ఫెనాసెటిన్, ఆస్పిరిన్ కాంబినేషన్ కలిగిన అనాల్జెసిక్‌లను దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీయవచ్చు. ఇది మూత్రపిండ కటి, యూరోథెలియల్ ట్యూమర్‌లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.

దీర్ఘకాలిక హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్..

రక్తం లేదా లైంగిక చర్య ద్వారా హెపటైటిస్ సి వైరస్ సంక్రమిస్తుంది. లైంగిక చర్యలు, రక్తం పరీక్షలు, ఇంజెక్షన్లు వంటివి తీసుకునే వారికి ఇది సులువుగా వస్తుంది.

డయాబెటిస్ మెల్లిటస్..

డయాబెటిస్ ఉన్నవారిలో మూత్రపిండ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. అయినా సరే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

జామ ఆకుల కషాయం తాగితే జరిగే మేలు ఎంతంటే..!

ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 20 , 2024 | 01:04 PM