Share News

Kidney: శరీరంలో ఈ అవయవాలలో వాపు కనిపిస్తే కిడ్నీ సమస్యలున్నట్టే.. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే..!

ABN , Publish Date - Jul 26 , 2024 | 08:49 AM

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో, శరీరంలోకి వెళ్లే రసాయనాల స్థాయిలను సమతుల్యం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

Kidney:  శరీరంలో ఈ అవయవాలలో వాపు కనిపిస్తే కిడ్నీ సమస్యలున్నట్టే.. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే..!
Kidney Problems

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో, శరీరంలోకి వెళ్లే రసాయనాల స్థాయిలను సమతుల్యం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మూత్రపిండాలలో ఏదైనా లోపం వచ్చినా.. ముత్రపిండాల పనితీరులో ఆటంకం ఏర్పడినా అది మొత్తం శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు కిడ్నీ వ్యాధుల ప్రమాదం పెరగడానికి కారణం అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో కొన్ని అవయవాలలో వాపు కనిపిస్తే అది కిడ్నీ సమస్యలకు సంకేతం అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు చాలా హెల్తీ..!


కిడ్నీ దెబ్బతినే ప్రారంభ దశల్లో సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. కిడ్నీలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా అవి దెబ్బతినడం మొదలైనప్పుడు శరీరంలో రసాయనాల అసమతుల్యత, కండరాలు, నరాలు, ఇతర కణజాలాల పని తీరులో సమస్యలు ఏర్పడతాయి. కిడ్నీలు రక్తాన్ని సరిగ్గా శుభ్రపరచలేవు. దీని కారణంగా టాక్సిన్స్, ద్రవాలు పేరుకుపోతాయి.

అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో అలసట, వాపు, మూత్రవిసర్జనలో మార్పులు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ వీటిని పెద్దగా పట్టించుకోరు.

బరువు తగ్గాలనుకునే వారికోసం భలే టిఫిన్లు.. వీటిలో కేలరీలు చాలా తక్కువ..!


పాదాల వాపు..

అలసట, గాయం వంటి సమస్యలు ఉన్నా పాదాలలో వాపు కనిపిస్తే అది మూత్ర పిండాల సమస్యకు సంకేతం కావచ్చు. ద్రవాలు, సోడియం అధికంగా ఉండటం వల్ల పాదాలలో మాత్రమే కాకుండా చేతులు, చీలమండలలో కూడా వాపు వస్తుంది. మూత్రపిండాల పనితీరు తగ్గడం, విష పదార్థాలు రక్తంలో పేరుకుపోవడం జరుగుతుంది. దీని వల్ల అలసట, బలహీనత ఏర్పడుతుంది.

కళ్ల చుట్టూ వాపు..

పాదాలలో వచ్చినట్టే కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కళ్ల చుట్టూ వాపు ఏర్పడుతుంది. మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ అవుతుంటే పెరియోర్పిటల్ ఎడెమా అనే సమస్య కనిపిస్తుంది. కొందరికి కిడ్నీ వ్యాధుల వల్ల కళ్లు పొడిబారుతుంటాయి. మూత్రపిండాల వ్యాధుల వల్ల రెటినోపతి అనే సమస్య కూడా వస్తుంది.

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!


జాగ్రత్తలు..

  • మధుమేహం ఉన్న ప్రతి ముగ్గరిలో ఒక్కరికి, అదిక రక్తపోటు ఉన్నవారిలో 60-90శాతం మందికి కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • మధుమేహం, రక్తపోటు ఉన్నవారు బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రక్తపోటును, మధుమేహం స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

  • కిడ్నీ సమస్యలు రాకూడదంటే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు సమృద్దిగా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.

మార్కెట్లో దొరికే A1, A2 నెయ్యి మధ్య తేడాలేంటి?

అరోమా థెరపీ గురించి విన్నారా? దీంతో లాభాలేంటంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 26 , 2024 | 08:49 AM