Share News

Kids Foods: పిల్లలకు పండ్ల రసాలు ఇవ్వవచ్చా.. ఇది ఎంత వరకు సేఫ్ అంటే..!

ABN , Publish Date - May 29 , 2024 | 05:03 PM

పండ్లు, పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆహారం నుండి పానీయాల వరకు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా జ్యూసులు చిన్న పిల్లలకు ఇవ్వవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. జ్యూసులు మంచి శక్తిని ఇస్తాయి. ద్రవాలు కాబట్టి జీర్ణం కావడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే చిన్న పిల్లలకు జ్యూసులు ఇవ్వడం మంచిదేనా?

Kids Foods: పిల్లలకు పండ్ల రసాలు ఇవ్వవచ్చా.. ఇది ఎంత వరకు సేఫ్ అంటే..!

పండ్లు, పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆహారం నుండి పానీయాల వరకు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా జ్యూసులు చిన్న పిల్లలకు ఇవ్వవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. జ్యూసులు మంచి శక్తిని ఇస్తాయి. ద్రవాలు కాబట్టి జీర్ణం కావడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే చిన్న పిల్లలకు జ్యూసులు ఇవ్వడం మంచిదేనా? ఒక వేళ ఇస్తే ఏ వయసు పిల్లలకు ఎంత మోతాదు జ్యూస్ ఇవ్వవచ్చు? పూర్తీగా తెలుసుకుంటే..

పిల్లలు 6 నెలల తరువాత మాత్రమే పండ్లు, కూరగాయల జ్యూసులు తీసుకోవచ్చు. కానీ జ్యూసులు చిన్న పిల్లలకు తక్కుువ పరిమాణంలో ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో చక్కెర స్థాయిలు, ఉప్పు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి.

పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!


ఒకటి నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు రోజుకు ఒకటి నుండి 3 ఔన్సుల కంటే ఎక్కువ పండ్ల రసం ఇవ్వకూడదు.

4 నుండి 5 సంవత్సరాల పిల్లలకు రోజుకు 4 నుండి 6 ఔన్సుల కంటే ఎక్కువ పండ్ల రసం ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ వయసు పిల్లలలో దంతాలు మెల్లగా వస్తూ ఉంటాయి. జ్యూసులు ఎక్కువగా ఇవ్వడం వల్ల దంతక్షయం ప్రమాదం పెరుగుతుంది.

పిల్లల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏ పండ్ల రసాన్ని అయినా పిల్లలకు ఇవ్వవచ్చు. అయితే ఆ పండ్ల రసంలో ఉప్పు లేదా చక్కెర పరిమాణం ఎక్కువ ఉండకూడదు.

పాశ్చరైజ్డ్ చేయని పండ్ల రసాలలో హానికరమైన బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పాశ్చరైజ్డ్ జ్యూస్ ను మాత్రమే ఇవ్వాలి.

కాలేయం డ్యామేజ్ అయితే కనిపించే లక్షణాలు ఇవీ..!


పిల్లలు నిద్రపోయే ముందు వారికి పండ్ల రసం ఇవ్వడం మంచిది కాదు. పిల్లల భోజనంలో కానీ, స్నాక్స్ సమయంలో కానీ పిల్లలకు పండ్ల రసం ఇవ్వవచ్చు.

పండ్ల రసాలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. కొన్నింటిలో పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఐరన్ కంటెంట్ కూడా ఉంటాయి. ముఖ్యంగా నారింజ రసంలో ఎముకల నిర్మాణానికి అవసరమైన కాల్షియం, విటమిన్-డి ఉంటుంది. కాబట్టి పిల్లలకు నారింజ పండ్ల రసం ఇవ్వవచ్చు.

కొంతమంది పిల్లలకు పండ్ల అలెర్జీ ఉంటుంది. కొన్ని రకాల పండ్లు తీసుకుంటే దురద, జలుబు, వాంతులు, దగ్గు, వికారం, వాంతులు, పెదవులు లేదా నాలుక వాపు రావడం, విరేచనాలు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలా అలెర్డీ ఉన్న పండ్లను పండ్ల రసంగా ఇచ్చినా కూడా పిల్లలకు అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పండ్ల రసాలు ఇవ్వకపోవడం మంచిది.

కాలేయం డ్యామేజ్ అయితే కనిపించే లక్షణాలు ఇవీ..!

పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 29 , 2024 | 05:03 PM