Kids Health: చిన్నపిల్లలను ఏసి లేదా కూలర్ గాలిలో పడుకోబెడుతుంటారా? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివీ..!
ABN , Publish Date - May 07 , 2024 | 01:47 PM
చిన్న పిల్లలను అటు వేడికి వదిలేయలేము ఇటు ఏసీలో ఏ ఆందోళన లేకుండా పడుకోబెట్టలేము. AC లేదా కూలర్ గాలిలో చిన్న పిల్లలను ఎలా నిద్రపుచ్చాలో.. గుర్తుంచుకోవలసిన విషయాలేంటో..
వేసవి తాపం పెరిగేకొద్దీ ఇంట్లో ఏసీ, కూలర్‌ల వాడకం తప్పనిసరి అవుతుంది. కూలర్, AC నుండి వచ్చే గాలి ఎలాంటి సందేహం లేకుండా చల్లగా ఉంటుంది. పెద్ద పిల్లలకు సాధారణంగా ఈ ఏసీ లేదా కూలర్ గాలితో ప్రత్యేక సమస్య ఏమీ ఉండదు. కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సమస్య తలెత్తుతుంది. అంత చిన్న పిల్లలను అటు వేడికి వదిలేయలేము ఇటు ఏసీలో ఏ ఆందోళన లేకుండా పడుకోబెట్టలేము. AC లేదా కూలర్ గాలిలో చిన్న పిల్లలను ఎలా నిద్రపుచ్చాలో.. గుర్తుంచుకోవలసిన విషయాలేంటో తెలుసుకుంటే..
బెడ్ షీట్ కప్పాలి..
AC లేదా కూలర్ నుండి వెలువడే గాలి నేరుగా పిల్లలకు తగలకూడదు. పిల్లల శరీరం వెచ్చగా ఉండేలా సన్నని బెడ్ షీట్‌తో కప్పాలి. షీట్ లేకుండా నిద్రపోయేలా చేస్తే పిల్లల ఆరోగ్యం క్షీణించి దగ్గు, కఫం, జలుబు సంభవించవచ్చు. పిల్లలు నేరుగా కూలర్ లేదా AC ముందు పడుకోకూడదు., పిల్లలు నిద్రించే స్థలం కొద్దిగా వెనుక వైపు ఉండాలి.
వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!
దుస్తులు..
పిల్లలను బెడ్ షీట్‌లో కప్పి తే కొందరు దుస్తులు సరిగా వేయరు. కానీ ఇది తప్పు. పిల్లలకు పూర్తీగా దుస్తులు వేసిన తర్వాత మాత్రమే నిద్రపుచ్చాలి. ముఖ్యంగా మీరు ఇంట్లో లేని సంకర్భంలో పిల్లలను బయట ఎక్కడో బంధువుల ఇంట్లో లేదా హోటల్‌లో నిద్రపెడుతున్నట్టు అయితే పిల్లలకు పూర్తీగా దుస్తులు వేయాలి.
స్కిన్ కేర్..
చల్లని గాలులు ఎప్పుడూ పొడిగా ఉంటాయి. చర్మం పొడిబారడాన్ని పెంచుతాయి. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. AC గాలి కారణంగా పిల్లల చర్మం పొడిగా మారుతుంది. అందుకే పిల్లలు నిద్రించడానికి ముందు పిల్లల శరీరంపై నూనె లేదా మాయిశ్చరైజర్ పూయాలి.
గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!
జాగ్రత్త..
పిల్లలు, పెద్దల మధ్య వ్యత్యాసం ఉంటుంది. పెద్దలు మురికి గాలి పీల్చుకున్నా దాన్ని భరించగలరు, కానీ పిల్లలో ఈ పరిస్థితి వేరుగా ఉంటుంది. కనీసం ఇంట్లో ఏసి, కూలర్ గాలి పరిశుభ్రంగా లేకపోయినా.. ఏసీని సరిగా మెయింటెయిన్ చేయకపోయినా, ఏసీలోని గాలి వల్ల పిల్లలకు అలర్జీ లేదా శ్వాసకోశ సమస్యలు రావచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.