Share News

Kids Health: ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు.. పిల్లలలో కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు మాయం..!

ABN , Publish Date - Jun 26 , 2024 | 01:20 PM

పిల్లలకు చాలావరకు చేతికి ఏది దొరికితే అది తినే అలవాటు ఉంటుంది. ఇంట్లో అయినా, బయట అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. కొన్ని సార్లు పాడైన ఆహారం, మరికొన్ని సార్లు అతిగా తినడం వంటివి జరిగుతుంటాయి. వీటి వల్ల పిల్లలకు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి

Kids Health: ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు.. పిల్లలలో కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు మాయం..!

పిల్లలకు చాలావరకు చేతికి ఏది దొరికితే అది తినే అలవాటు ఉంటుంది. ఇంట్లో అయినా, బయట అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. కొన్ని సార్లు పాడైన ఆహారం, మరికొన్ని సార్లు అతిగా తినడం వంటివి జరిగుతుంటాయి. వీటి వల్ల పిల్లలకు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఇంట్లోనే కొన్ని సులువైన, హానికరం కాని చిట్కాలతో వీటిని తగ్గించవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

నిమ్మరసం..

పిల్లలు కడుపునొప్పి సమస్యతో ఇబ్బంది పడుతుంటే వారికి నిమ్మరసం కలిపిన నీరు ఇవ్వవచ్చు. నిమ్మరసంలో ఉన్న ఆమ్లం ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. పిల్లలు నిమ్మరసం నీరు తాగడానికి ఇష్టపడకపోతే అందులో కొద్దిగా తేనె కలిపి ఇవ్వవచ్చు.

పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!


సోపు నీరు..

సోపు లేదా సొంపులో ఔషద గుణాలు మెండుగా ఉంటాయి. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా సోపు గింజలు వేసి ఉడికించాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి గోరు వెచ్చగా తాగించాలి. ఇది గ్యాస్ సమస్యను, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కడుపుకు చల్లదనం ఇవ్వడం ద్వారా కడుపు నొప్పి తగ్గిస్తుంది.

అల్లం టీ..

పిల్లలు గ్యాస్ కారణంగా కడుపు నొప్పి ఎదుర్కుంటున్నట్టైతే అల్లం టీ చక్కగా సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో అల్లం ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి. తరువాత ఫిల్టర్ చేసి తాగించాలి. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్షణాలు వేగంగా పనిచేస్తాయి. కడుపు నొప్పి సులువుగా తగ్గిస్తాయి.

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!


సెలెరీ నీరు..

సెలెరీ నీరు పిల్లల కడుపు సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా సెలెరీ వేసి బాగా ఉడికించాలి. ఈ నీటిని వడగట్టి పిల్లలకు ఇవ్వాలి. లేదంటే సెలెరీని వేయించి పిల్లలకు ఆహారంలో ఇవ్వవచ్చు. ఇది కడుపును రిలాక్స్ చేస్తుంది.

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2024 | 01:20 PM