Kids Health: పిల్లలలో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే 5 సూపర్ ఫుడ్స్ ఇవీ..!
ABN , Publish Date - Apr 13 , 2024 | 12:21 PM
పెరుగుతున్న పిల్లలకు పుష్కలమైన పోషకాహారాన్ని అందించడానికి తల్లిదండ్రులు కష్టపడుతుంటారు. సహజంగా ఎముకలను బలోపేతం చేసే ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.
పిల్లలలో ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వారి పెరుగుదల, అభివృద్ధికి చాలా అవసరం. కానీ పిల్లలు తరచుగా సరిగా తినరు. వారి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలున్న మంచి ఆహారాన్ని తినడానికి మొరాయిస్తారు.ఆరోగ్యకరమైన ఆహారాలు మరియు భోజనం ద్వారా పోషకాహారాన్ని చొప్పించడానికి ప్రయత్నించే తల్లిదండ్రులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఇది ఒకటి . పెరుగుతున్న పిల్లలకు పుష్కలమైన పోషకాహారాన్ని అందించడానికి కష్టపడుతూ ఉంటే, సహజంగా ఎముకలను బలోపేతం చేసే ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
పిల్లల ఆహారంలో పాల ఆధారిత పదార్థాలు జోడించడానికి సులభమైన మార్గం వారికి స్మూతీస్, షేక్స్, పెరుగు ఆధారిత సలాడ్‌లు, శాండ్‌విచ్‌లు, పెరుగును తేనెతో కలిపి ఇవ్వడం.
ఇది కూడా చదవండి: విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయల గురించి తెలుసా?
ఆకు కూరలలో ముదురు ఆకు కూరలు బచ్చలికూర, పాలకూర, కాలే, ఆవాలు మొదలైన వాటిలో కాల్షియం, విటమిన్ K, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలన్నీ ఉంటాయి. ఇవన్నీ పిల్లలకు సంపూర్ణ పోషణ ఇస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని, జీవక్రియ రేటును పెంచుతుంది. ఎముక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. శక్తిని మెరుగుపరుస్తుంది. పిల్లలు ఆకు కూరలు తినేలా చేయడానికి సులభమైన మార్గం పాస్తాలు, పిజ్జాలు, పానీయాలు, శాండ్విచ్ లలో వాటిని జోడించాలి.
సాల్మన్ వంటి ఇతర కొవ్వు చేపలలో విటమిన్ D, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలలతో నిండి ఉంటాయి. సాల్మన్, మాకేరెల, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు ఎముక ఆరోగ్యాన్ని, ఎముక ఖనిజ సాంద్రతను, శరీరంలో కాల్షియం శోషణను మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన ఎంపికగా ఉపయోగపడతాయి.
బాదం, చియా గింజలు, నువ్వులు వంటి గింజలు, విత్తనాలలో కాల్షియం, మెగ్నీషియం, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల మిశ్రమాలను ఉపయోగించి స్మూతీస్, సోర్బెట్‌లు, షేక్‌లను తయారు చేసి పిల్లల ఆహారంలో భాగం చేయవచ్చు.
బీన్స్, శనగలు, కిడ్నీ బీన్స్, కాయధాన్యాలు, బ్లాక్ బీన్స్ వంటి చిక్కుళ్ళలో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలలో ఎముకల అభివృద్ధికి ముఖ్యమైనవి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.