Leg Cramps: నిద్రపోతున్నప్పుడు కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయా? అయితే మీకూ ఈ లోపమున్నట్టే లెక్క!
ABN , Publish Date - Jan 16 , 2024 | 01:15 PM
కాళ్ళ తిమ్మిర్లు నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి అసలు కారణాలు ఇవీ..
చాలామందికి రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్లు తిమ్మిర్లుగా ఉంటాయి. ఈ సమస్య కారణంగా నిద్ర సరిగా ఉండదు. చాలామంది బాగా తిరగడం వల్లో, పని ఎక్కువ చేయడం వల్లో ఇలా జరుగుతుందిలే అని ఈ సమస్యను తేలికగా తీసుకుంటారు. వేడి ఎక్కువ చేయడం వల్ల అలా జరిగి ఉంటుందిలే అదే తగ్గిపోతుంది అని దానికి అలవాటు పడిపోతారు. కానీ ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాళ్లలో తిమ్మిర్ల వెనుక కారణాల గురించి పూర్తీగా తెలుసుకుంటే..
కాళ్ల తిమ్మిర్లు అనేక కారణాల వల్ల వస్తాయి. శరీరంలో తగినంత పోషకాలు లేకపోవడం, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్, కండరాల సంబంధిత సమస్యలు, ధీర్ఘకాలిక వ్యాధులు కాళ్ల తిమ్మిర్లకు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అయితే వీటికి శరీరంలో కొన్ని విటమిన్లు లోపించడమే కారణమని తేలింది.
ఇది కూడా చదవండి: ఖరీదైన ఫేస్ వాష్ లు కాదు.. పచ్చిపాలు ఇలా వాడితే ఎన్ని లాభాలంటే..!
విటమిన్-బి..
శరీరంలో విటమిన్-బి లోపిస్తే రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. విటమిన్-బి లోపాన్ని భర్తీ చేయడానికి ఆహారంలో యాపిల్, ఆరెంజ్, కివి, పెరుగు, జున్ను, అరటిపండ్లు, బఠానీలు, గింజలు మొదలైనవి తీసుకోవాలి. మాంసాహారులైతే చికెన్, సాల్మన్, ట్యూనా చేపలు తీసుకోవాలి.
విటమిన్-డి..
రాత్రిపూట కాళ్లలో తిమ్మిర్ల సమస్య విటమిన్ డి లోపం వల్ల కూడా రావచ్చు. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే అది నేరుగా ఎముకలపై ప్రభావం చూపుతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
డోపమైన్..
విటమిన్ డి లోపం ఉంటే అది డోపమైన్‌ను ప్రభావితం చేస్తుంది. రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి ఉదయం సూర్యకాంతిలో కొద్దిసేపు గడపాలి. సాల్మన్, మాకేరెల్, సార్డిన్ చేపలలో కూడా విటమిన్-డి లభిస్తుంది.
ఇది కూడా చదవండి: వాము గింజల నీటిని తాగితే.. కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
కాల్షియం..
శరీరంలో కాల్షియం లోపించడం వల్ల కూడా రాత్రి నిద్రిస్తున్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. దీనిని నివారించడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాలు, చీజ్, పెరుగు, బాదం బాగా తినాలి.
ఐరన్..
ఐరన్ లోపం ఉన్నా కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో బచ్చలికూర, బ్రోకలీ, గింజలు, కిడ్నీ బీన్స్, శనగలు మొదలైనవి తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: Weight Loss:: వెయిట్ లాస్ డ్రింకులు అక్కర్లేదు.. బరువు తగ్గడానికి ఈ పండు తినండి చాలు!!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.