Men Health Tips: పురుషులు ఈ ఫుడ్స్ తింటే ఇక రచ్చ రచ్చే..!
ABN , Publish Date - Aug 12 , 2024 | 05:20 PM
Men Healthy Food: కొంతమంది తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మార్కెట్‌లో లభించే అడ్డమైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. కానీ సహజమైన ఆహారం తీసుకోవడం ద్వారా సంతానలేమి సమస్యను అధిగమించవచ్చు. ఇవి వీర్య కణాల సంఖ్యను పెంచి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరి పురుషులు ఎలాంటి ఆహారాలు తినాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
Men Healthy Food: ప్రస్తుత కాలంలో జీవనశైలి, ఆహారపు అలవాట్లు పురుషుల ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల నపుంసకత్వ సమస్య పురుషులను వేధిస్తోంది. వ్యాయామం లేకపోవడం, మద్యం సేవించడం, ధూమపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా వంధ్యత్వానికి కారణమవుతోంది. పురుషులలో సంతానలేమి సమస్యను అధిగమించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం తిసుకోవాలి.
అధిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత శరీరంలో లిబిడో సామర్థ్యం తగ్గడానికి, లైంగిక ఆసక్తి తగ్గడానికి కారణమవుతుంది. అందుకే, లిబిడో పెంచుకోవడానికి కొందరు మార్కెట్‌లో లభించే ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇవేవీ లేకుండానే సహజమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా పురుషులు సంతానలేమి సమస్యను అధిగమించవచ్చు. వీర్య కణాల సంఖ్యను పెంచి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పురుషులలో లిబిడోని పెంచే 5 ఉత్తమ ఆహారాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..
మునగ: లైంగిక ఆసక్తి, లిబిడో, అంగస్తంభన వంటి అనేక సమస్యలతో బాధపడేవారికి మునగ దివ్యౌషధంగా పని చేస్తుంది. ఐరోపా, ఈజిప్టులో పురుషులు తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మునగ కాయ, ఆకులను ఉపయోగించేవారు. మునగ కాయలు, మునగ ఆకుతో కూర వండుకుని తినొచ్చు. తద్వారా పురుషులకు మేలు జరుగుతుంది.
అరటిపండు: పురుషులు ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లలో విటమిన్ ఎ, సి, బి1, ప్రొటీన్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో, వాటి నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నించే పురుషులు కనీసం రోజూ ఒక అరటిపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
డార్క్ చాక్లెట్, బ్లాక్ కాఫీ: పురుషులు తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తప్పకుండా డార్క్ చాక్లెట్, బ్లాక్ కాఫీని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండూ పురుషులను అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయట. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్లాక్ కాఫీ, డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల పురుషులలో లైంగిక సామర్థ్యం మెరుగవుతుంది. చాక్లెట్‌లోని కోకో శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అందుకే దీనిని తినడం వలన ప్రయోజనం చేకూరుతుంది.
వెల్లుల్లి: పురుషులలో నపుంసకత్వానికి చికిత్స చేయడంలో వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులోని బి6, సెలీనియం రెండూ పురుషులలో లిబిడోను పెంచడానికి సహాయపడతాయి. వెల్లుల్లి జననాంగాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. తద్వారా సంతానోత్పత్తి సులభంగా జరగడానికి సహాయపడుతుంది.
ఆకు కూరలు: సూపర్ ఫుడ్స్‌లో ఆకు కూరలు ఒకటి. ఆకు కూరలు శరరీంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పురుషుల లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. అందుకే వారానికి కనీసం మూడుసార్లైనా ఆకు కూరలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
టొమాటో: నపుంసకత్వం ఉన్న పురుషులలో లైకోపీన్ తక్కువగా ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్, లైంగిక సమర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు తమ ఆహారంలో టమోటాలను చేర్చుకోవాలి. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇందులో లైకోపీన్ అధిక మొత్తంలో ఉంటుంది. టొమాటోలు లైంగిక సమస్యలను దూరం చేయడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.