Migraine Vs Sleeping: మైగ్రేన్ ఉన్నవారికి ప్రశాంతమైన నిద్ర రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
ABN , Publish Date - Jul 09 , 2024 | 07:40 AM
మెదడు భాగంలో ఒక వైపు లేదా వెనుక భాగం వైపు విపరీతమైన తలనొప్పి వచ్చే సమస్యను మైగ్రేన్ గా చెబుతారు. దీని కారణంగా ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతంగా ఆహారం తీసుకోవడం, సాధారణ జీవనశైలి దూరం అవుతాయి. కొందరు ఏ చిన్నపాటి శబ్దం విన్నా, కాస్త వెలుతురు చూసినా అసౌకర్యం ఫీలవుతుంటారు.
మైగ్రేన్ ఈ మద్య చాలామందిని వేధిస్తున్నసమస్య. మెదడు భాగంలో ఒక వైపు లేదా వెనుక భాగం వైపు విపరీతమైన తలనొప్పి వచ్చే సమస్యను మైగ్రేన్ గా చెబుతారు. దీని కారణంగా ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతంగా ఆహారం తీసుకోవడం, సాధారణ జీవనశైలి దూరం అవుతాయి. కొందరు ఏ చిన్నపాటి శబ్దం విన్నా, కాస్త వెలుతురు చూసినా అసౌకర్యం ఫీలవుతుంటారు. మైగ్రేన్ కు స్పష్టమైన వైద్యం, మందులు లేకపోవడం వల్ల దీని వల్ల చాలామంది నరకం అనుభవిస్తుంటారు. అయితే మైగ్రేన్ కారణంగా నిద్ర పాడవకూడదన్నా, ప్రశాంతంగా నిద్రపోవాలన్నా ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి.
ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!
నిద్ర షెడ్యుల్..
రాత్రి వేళలలో ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. వీకెండ్స్ లోనూ, సెలవు రోజులలో కూడా ఒకే టైమింగ్స్ ఫాలో కావాలి. దీని వల్ల శరీరంలో ఉండే అంతర్గత గడియారం నిద్రను నియంత్రణలో ఉంచుతుంది.
ప్రశాంత వాతావరణం..
పడుకోవడానికి ముందు ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఏదైనా పుస్తకాన్ని చదవడం, మంచి సంగీతం వినడం, కాసేపు తేలికపాటి నడక, మెడిటేషన్ వంటివి ఫాలో అవ్వాలి. మనసును ఆందోళన పెట్టే చర్చలు, గొడవలు చేయడం, సోషల్ మీడియాలో సమయం గడపడం మానుకోవాలి. ఇది మెదడును, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
స్క్రీన్ సమయం..
నిద్రపోయే ముందు టీవీ, సిస్టమ్, మొబైల్ మొదలైన వాటితో కాలక్షేపం చేయడం మానుకోవాలి. కనీసం నిద్రపోవడానికి గంట ముందు వీటిని బంద్ చేయాలి. స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ నిద్రను పాడు చేస్తుంది.
వర్షాకాలంలో కండ్లకలక రాకూడదంటే.. ఇలా చేయండి..!
వ్యాయామం..
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం చాలా ముఖ్యం. నిద్ర వేళకు కొన్ని గంటల ముందు.. అంటే సాయంత్రం సమయంలో వ్యాయామం లేదా నడక వంటివి చేయడం వల్ల రాత్రి హాయిగా నిద్ర వస్తుంది.
ఒత్తిడి..
మైగ్రేన్ ఉన్నవారిలో ఒత్తిడి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఒత్తిడి కారణంగానే మైగ్రేన్ వస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి ధ్యానం, ఒత్తిడిని తగ్గించే వివిధ పద్దతులు ఫాలో కావాలి. నిద్రపోయే ముందు మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ మసాలా దినుసులు తింటే చాలు.. పొట్ట కొవ్వు తగ్గిపోతుందట..!
పగటి నిద్ర..
పగటి సమయంలో నిద్ర పోయే అలవాటు రాత్రి నిద్రను దెబ్బ తీస్తుంది. పగటి పూట నిద్ర వచ్చినట్టు అనిపించినా దాన్ని కేవలం 20 నిమిషాల వరకు మాత్రమే పరిమితం చెయ్యాలి. అంతకంటే ఎక్కువ ఎప్పుడూ నిద్రపోకూడదు.
కాఫీ..
కాఫీ లో ఉండే కెఫీన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు, మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు సాయంత్రం 6 గంటల తరువాత కాఫీని, టీని తీసుకోకపోవడం మంచిది. కావాలంటే నిద్రకు ముందు నిద్రకు ఉపకరించే చమోమిలే టీ, బార్లీ టీ వంటివి తీసుకోవచ్చు.
కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయ్.. చెక్ చేసుకోండి..!
ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.