Morning Magic: రోజూ ఉదయాన్నే ఈ ఒక్క పని చేశారంటే చాలు.. ఎన్నిరోగాలు నయమవుతాయంటే..!
ABN , Publish Date - Jan 01 , 2024 | 01:41 PM
రోజూ ఉదయాన్నే ఈ ఒక్క పని చేయడం వల్ల శరీరాన్ని పట్టి పీడించే బోలడు రోగాలు మాయమైపోతాయి.
ఉదయం లేవగానే చాలామంది బద్దకంగా ఒళ్లు విరుచుకుని కాలకృత్యాలు తీర్చుకుని టిఫిన్ చేసి ఉద్యోగాల నిమిత్తం వెళ్లిపోతుంటారు. అరోగ్యం మీద స్పృహ ఉన్నవాళ్లు అయితే కొద్దిసేపు వ్యాయామం కూడా చేస్తారు. అయితే ఉదయాన్నే అందరూ ఒకే ఒక్క పని చేస్తే చాలు.. శరీరాన్ని వేధించే బోలెడు రోగాలు చాలా సులువుగా తగ్గిపోతాయి. ప్రతిరోజూ ఉదయం సమయంలో సూర్యుడి నుండి వెలువలే లేత కిరణాల సమక్షంలో కొద్దిసేపు కూర్చోమని చెబుతున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు. అసలు సూర్యుని లేత కిరణాలు శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
ఉదయాన్నే సూర్యుని కిరణాలు(morning sun light) వెచ్చగా శరీరాన్ని తాకితే అది శరీరంలో అవయవాలను ఉత్తేజం చేస్తుంది. శరీరాన్ని చురుగ్గా ఉంచే న్యూరోట్రాన్మిటర్ అయిన సెరోటోనిన్ ను విడుదల చేయడం ద్వారా నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో ఈ సూర్యుని లేత కాంతి సహాయపడుతుంది. ఇక ఈ లేత సూర్యుని వెలుగులో విటమిన్-డి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం 8గంటలలోపు వెలువడే సూర్యకిరణాల సమక్షంలో 15-30నిమిషాల సమయాన్ని గడపడం ద్వారా శరీరంలో విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు తమ పిల్లల గురించి టీచర్లను తప్పక అడగాల్సిన ప్రశ్నలివి..!
ఉదయాన్నే లభించే సూర్య కాంతి ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆశావాద మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. శరీరం పూర్తీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
శరీరంలో స్కిరాడియన్ రిథమ్ ఉంటుంది. ఇది నిద్రాచక్రంగా పరిగణిస్తారు. ఉదయం వెలువడే సూర్యకాంతి ఈ నిద్రాచక్రాన్ని సక్రమంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. హార్మన్ ఉత్పత్తిని సమతుల్యంగా ఉంచుతుంది. దీని కారణంగా నిద్ర మెరుగ్గా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా చర్మసంబంధ సమస్యలను, తొందరగా వృద్దాప్యం సంభవించడం, కళ్లు దెబ్బతినడం, చర్మక్యాన్సర్ వంటి ప్రమాదాలు రాకుండా చేస్తుంది. అయితే సూర్య కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఎండలో గడపడం మాత్రం మంచిది కాదు.