Organic Spices: సేంద్రీయ సుగంధ ద్రవ్యాలు ధర ఎక్కువ ఎందుకు? వీటి గురించి అపోహలు.. నిజాలు ఇవే..!
ABN , Publish Date - May 09 , 2024 | 01:49 PM
వ్యవసాయంలోనూ, పంటలలోనూ రసాయనాలు లేకుండా పండించే పంటలను సేంద్రియ పంటలు అంటూంటారు. సేంద్రియ సాగుకు ఖర్చు నుండి కష్టం వరకు అంతా ఎక్కువే.. కానీ ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయనే కారణంతో వీటి కొనుగోలు వైపు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
సేంద్రియం.. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతోంది. వ్యవసాయంలోనూ, పంటలలోనూ రసాయనాలు లేకుండా పండించే పంటలను సేంద్రియ పంటలు అంటూంటారు. సేంద్రియ సాగుకు ఖర్చు నుండి కష్టం వరకు అంతా ఎక్కువే.. కానీ ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయనే కారణంతో వీటి కొనుగోలు వైపు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సేంద్రియ సుగంధ ద్రవ్యాల ధర నుండి వీటి మన్నిక వరకు చాలా విషయాల గురించి ప్రజలలో అపోహలు ఉన్నాయి. వీటి గురించి అపోహలు ఏంటో.. ఆ నిజాలు ఏంటో తెలుసుకుంటే..
ఖరీదు..
సేంద్రీయ సుగంధ ద్రవ్యాల ధర ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో కూడా ఇలాగే ఉంటుంది. వీటి సాగుకు సాధారణ రసాయన ఎరువుల సాగు కంటే ఎక్కువ ఖర్చు అవుతుందనేది నిజమే. అయినప్పటికీ మరీ అంత ఎక్కువగా ఉండదు. ఈ సాగు ప్రారంభించిన మొదట్లో దిగుబడి తక్కువగా ఉంటుంది. కానీ రానురాను భూమి మరింత బలపడే కొద్దీ దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్గానిక్ ఉత్పత్తులను సూపర్ మార్కెట్లలోనూ, మాల్స్ లోనూ కొనకుండా నేరుగా రైతుల వద్ద లేదా రైతు మార్కెట్ల నుండి కొనుగోలు చేయడం మంచిది.
అక్షయ తృతీయ గురించి ఈ నిజాలు తెలుసా..?
రుచి..
ఆర్గానిక్ ఉత్పత్తులు అధిక రుచితో కూడి ఉంటాయని చాలా మంది అంటారు. అయితే వీటి రుచి వీటిని ఎలా నిల్వచేస్తారు, ఎంత తాజాగా విషయాల మీద ఆధారపడి ఉంటుంది . రుచి అనేది సాగు పద్దతి నుండే కాదు.. తాజాదనం వల్ల కూడా వస్తుంది. అందుకే ఆర్గానిక్ కొనుగోలు చేసినా తాజాగా ఉన్నాయా లేదా చూసుకోవాలి.
కంట్రోలింగ్..
సేంద్రియ అనే పదం వినగానే చాలామంది అది అంతా ఫేక్.. సాధారణ ఉత్పత్తులను సేంద్రీయం కింద అమ్మేస్తుంటారు అని అంటుంటారు. కానీ సేంద్రియ ఉత్పత్తులను కంట్రోల్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), EU ఆర్గానిక్ సర్టిఫికేషన్ వంటి సంస్థలు కంట్రోల్ చేస్తాయి. సేంద్రీయ లేబుల్స్ ను ఇవి జారీ చేస్తాయి. ఆర్గానిక్ ఉత్పత్తులు కొనేముందు లేబుల్ గమనించాలి.
వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!
రసాయనాలు ఉండవు..
సేంద్రీయ ఉత్పత్తులను సాగు చేయడానికి రసాయనాలు అస్సలు వాడరని చాలామంది అనుకుంటారు. కానీ ఆర్గానిక్ సర్టిపికేషన్ పొందిన సింథటిక్ పురుగు మందులు పరిమిత మోతాదులో ఉపయోగించబడతాయి. ఆర్గానిక్ అంటే అస్సలు పురుగు మందులు ఉపయోగించరు అని అర్థం కాదు.
షెల్ఫ్ లైఫ్..
సేంద్రీయ ఉత్పత్తులు తొందరగా పాడవుతాయని కొందరు అంటుంటారు. కానీ సుగంధ ద్రవ్యాల షెల్ప్ లైట్ అవి సేంద్రీయమా కాదా అనేదానికంటే ఎలా నిల్వ చేస్తున్నాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. వేడి, కాంతి, గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!
అక్షయ తృతీయ గురించి ఈ నిజాలు తెలుసా..?
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.