Share News

Paralysis: పెరాలసిస్ రావడానికి అసలు కారణం ఇదా? వైద్యులు తేల్చిన నిజాలివీ..!

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:49 PM

పెరాలసిస్ లేదా పక్షవాతం చాలామందిలో తరచుగా వస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా వృద్దాప్యానికి లోనైన వారిలో కనిపించేది. కానీ కాల క్రమేణా అన్ని వయసుల వారు ఈ సమస్య బాధితులుగా మారుతున్నారు. అయితే పెరాలసిస్ రావడానికి అసలు కారణం ఏంటో వైద్యులు బయటపెట్టారు.

Paralysis: పెరాలసిస్ రావడానికి అసలు కారణం ఇదా? వైద్యులు తేల్చిన నిజాలివీ..!

పెరాలసిస్ లేదా పక్షవాతం చాలామందిలో తరచుగా వస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా వృద్దాప్యానికి లోనైన వారిలో కనిపించేది. కానీ కాల క్రమేణా అన్ని వయసుల వారు ఈ సమస్య బాధితులుగా మారుతున్నారు. అయితే పెరాలసిస్ రావడానికి విటమిన్ లోపాలు కారణాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్-బి12 లోపం పెరాలసిస్ కు ప్రధాన కారణం అని అంటున్నారు. అసలు పెరాలసిస్ కు విటమిన్-బి12 లోపం ఎలా కారణం అవుతుంది? దీని వెనుక ఉన్న నిజాలేంటి? తెలుసుకుంటే..

విటమిన్-బి12 నరాలు దెబ్బతినడానికి, పక్షవాతానికి ప్రధాన కారణం అవుతుంది. విటమిన్-బి12 ను థయామిన్ అని కూడా అంటారు. ముఖ్యంగా పెద్దవారిలో నాడీ కణాలు, వాటిని రక్షించే తొడుగుల ఆరోగ్యం బాగుండాలంటే విటమిన్-బి12 చాలా అవసరం. నరాలు, కండరాలు, గుండె పనితీరుకు కూడా థయామిన్ కీలకంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో పోషకాలను శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జాగ్రత్త.. ఈ శబ్దాలు వింటే వినికిడి లోపం రావడం ఖాయం..!


విటమిన్-బి12 ఎక్కువగా లోపిస్తే బెరిబెరీ వ్యాధికి దారితీస్తుంది. ఇది నరాలు దెబ్బతినడానికి, కండరాల బలహీనతకు, తీవ్రమైన పరిస్థితులలో పక్షవాతానికి కూడా దారితీస్తుంది.

బెరిబెరీ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పొడి బెరిబెరీ వ్యాధి. రెండవది తడి బెరిబెరీ వ్యాధి. పొడి బెరిబెరీ వ్యాధిలో నాడీ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇది పక్షవాతానికి దారితీస్తుంది. తడి బెరిబెరీ వ్యాధిలో హృదయనాళ వ్యవస్థ ప్రభావితం అవుతుంది.

పొడి బెరిబెరీ వ్యాధి వచ్చినప్పుడు శరీరంలో నొప్పి, జలదరింపు, చేతులు, కాళ్ళలో స్పర్శ కోల్పోవడం, కండరాల బలహీనత, కాళ్లను కదిలించడంలో కష్టం వంటి సమస్యలు ఉంటాయి. ఇది పక్షవాతానికి దారితీయవచ్చు కూడా.

విటమిన్-బి12 లోపిస్తే వెర్నికే కోర్సాకోఫ్ సిండ్రోమ్ సమస్యకు దారితీయవచ్చు. ఇది మెదడు దెబ్బతినడానికి కారణమయ్యే నాడీ సంబంధింత సమస్య.

ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

జాగ్రత్త.. ఈ శబ్దాలు వింటే వినికిడి లోపం రావడం ఖాయం..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 13 , 2024 | 04:49 PM