Almond Peel: నానబెట్టిన బాదం పొట్టు తీయకుండా తింటే ఏమవుతుంది..
ABN , Publish Date - Dec 05 , 2024 | 09:28 AM
రోజూ పది బాదం పప్పులు తింటే శరీరంలో ఎన్నో పోషకాలను గ్రహిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, వీటిని సరైన పద్దతిలో తీసుకోకుంటే అదనంగా మరిన్ని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది...
ప్రొటీన్లు, ఫైబర్, హెల్తీ ఫాట్స్ ఇవన్నీ ఒకే దగ్గర లభించాలంటే బాదం తినాల్సిందే. ఇవే కాదు రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. వీటిని రాత్రంతా కాస్త గోరువెచ్చని నీటిలో నానబెట్టి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని చెప్తారు. నీటిలో నానినప్పుడు వాటి నుంచి లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలో కొవ్వును కరిగేలా చేస్తుంది.
కురుల కోసం..
జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా పిడికెడు బాదం పప్పులతో చెక్ పెట్టొచ్చు. ఇందులో ఉండే రకరకాల విటమిన్లు, పోషకాలు జుట్టుని ఒత్తుగా పెంచడమే కాకుండా మృదువుగా మారుస్తాయి. ఇందులో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ముడతలు రాకుండా చేస్తుంది.
షుగర్‌ను అదుపు చేస్తుంది..
బాదంలోని మెగ్నీషియం రక్తంలోని చక్కెరల్ని అదుపు చేస్తుంది. తద్వారా ఆహారం ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గుతుంది. బాదం కాయలు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయం చేస్తాయి. మేలు రకమైన కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ ను బాగా పెంచుతాయి. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి బాదం మేలు చేస్తుంది.
ఇలా తింటే ప్రమాదమే..
చాలా మంది బాదంను నానబెట్టి వాటిని తొక్క తీయకుండానే తినేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడం అటుంచితే కొత్త సమస్యలు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. బాదంపప్పు తొక్కను తీయకుండా తింటే, అది జీర్ణం కాదు, కడుపు నొప్పిని కలిగిస్తుంది. అంతే కాకుండా చర్మంలో ఉండే టానిక్, హైడిక్ యాసిడ్ వంటి యాంటీ న్యూట్రీషియన్స్ పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనిని తొక్కతో కలిపి తింటే రక్తంలో పిత్త దోషం పెరుగుతుంది. కాబట్టి రాత్రంతా నానబెట్టి, తొక్క తొలగించిన తర్వాత తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.