Share News

Perfume: మెడ దగ్గర పెర్ఫ్యూమ్ కొట్టే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 09:30 AM

చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పెర్ఫ్యూమ్ ను వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా పెర్ఫ్యూమ్ ను మెడ దగ్గర అప్లై చేసేవారు ఎక్కువ. అయితే ఇలా మెడ దగ్గర పెర్ఫ్యూమ్ ను అప్లై చేయడం వెనుక షాకింగ్ నిజాలు బయటపెట్టారు పరిశోధకులు.

Perfume: మెడ దగ్గర పెర్ఫ్యూమ్ కొట్టే అలవాటుందా?  ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!

నేటికాలంలో చెమట, వాయు కాలుష్యం, బయటి వాతావరణ దుర్గంధం వంటివి అధిగమించడానికి చాలామంది పెర్ఫ్యూమ్ లు ఎంచుకుంటారు. ఇప్పట్లో పెర్ఫ్యూమ్ వాడని వారు ఉన్నారంటే ఆశ్చర్యపోవాలి కానీ వాడే వారిని చూసి ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పెర్ఫ్యూమ్ ను వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా పెర్ఫ్యూమ్ ను మెడ దగ్గర అప్లై చేసేవారు ఎక్కువ. అయితే ఇలా మెడ దగ్గర పెర్ఫ్యూమ్ ను అప్లై చేయడమనేది చాలా పెద్ద సమస్యలు తెచ్చి పెడుతుందని, ఇది చాలా ప్రమాదకరమైన అలవాటని చర్మ సంరక్షణ నిపుణులు, వైద్యులు అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?


చాలావరకు పెర్ఫ్యూమ్ యాడ్స్ గమనిస్తే పెర్ఫ్యూమ్ ను మెడ దగ్గర స్ప్రే చేయడం చూస్తుంటాం. కేవలం మెడ దగ్గర మాత్రమే కాదు.. మణికట్టు దగ్గర కూడా స్ప్రే చేస్తూంటారు. దీన్ని చూసి పెర్ఫ్యూమ్ వాడే చాలామంది పెర్ఫ్యూమ్ ను మెడ దగ్గర స్ప్రే చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ వస్తుందని అంటున్నారు. దీని వల్ల చర్మం రంగు మారుతుంది. అసలు పెర్ఫ్యూమ్ కారణంగా చర్మం రంగు ఎందుకు మారుతుందంటే..

6 సెకెన్ల ముద్దుకు ఇంత పవరుందా?


ఫోటోసెన్సిటివ్..

గాఢమైన సువాసనలు చర్మాన్ని మరింత సున్నితంగా మార్చేస్తాయి. పెర్ఫ్యూమ్ లో ఉండే రసాయనాలను ఫోటోసెన్సిటైజింగ్ ఏజెంట్లు అంటారు. పెర్ఫ్యూమ్ స్ప్రే చేసిన భాగం సూర్యరశ్మికి గురైనప్పుడు అది వాపుకు కారణమవుతుంది, ఇది హైపర్పిగ్మెంటేషన్కు దారితీస్తుంది.

చికాకు, అలెర్జీ..

ఆల్కహాల్, సింథటిక్ సమ్మేళనాలున్న పెర్ఫ్యూమ్‌లోని కొన్ని భాగాలు చర్మంపై చికాకు, అలెర్జీ కలిగిస్తాయి. ఎక్కువసేపు చికాకు లేదా మంట ఏర్పడితే మెలనోసైట్‌లు అంటే పిగ్మెంటేషన్‌కు కారణమయ్యే కణాలను మరింత ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఫలితంగా ముదురు మచ్చలు ఏర్పడతాయి.

లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ వంటి స్వయం ప్రతిరక్షక చర్మ వ్యాధులను ప్రేరేపిస్తుంది, ఇది పిగ్మెంటేషన్‌ కు కారణం అవుతుంది.

6 సెకెన్ల ముద్దుకు ఇంత పవరుందా?

తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 08 , 2024 | 09:30 AM