Psoriasis: మీకు చర్మ సమస్యలున్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే ఆ జబ్బు ఉన్నట్టే..
ABN , Publish Date - Oct 30 , 2024 | 03:18 PM
చర్మ సమస్యలు చాలా సాధారణమే అయినా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఇబ్బందే..
వాతావరణం మార్పుకు లోనైతే మొట్టమొదట ప్రభావితమయ్యేది చర్మమే.. కేవలం వాతావరణం పరంగానే కాకుండా అనేక కారణాల వల్ల చర్మం అసౌకర్యానికి లోనవుతూ ఉంటుంది. చర్మానికి సరిపడని ఉత్పత్తులు వాడినా, శరీరానికి సరిపడని ఆహారం తిన్నా చర్మం అలర్జీకి గురవుతుంది. అయితే ఇవన్నీ అప్పటికప్పుడు సంరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి. సరిపడని ఆహారాలు, ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల అలెర్జీకి దూరంగా ఉండవచ్చు. కానీ కొందరు చర్మం మీద దద్దుర్లు, దురద, చర్మం మీద పొట్టు లేవడం.. అది క్రమంగా పుండ్లుగా మారడం వంటి సమస్యలకు లోనవుతూ ఉంటుంది. అసలు చర్మం ఇలా ఎందుకు అవుతుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
Diabetes: జస్ట్.. రోజూ ఒక్క గ్లాస్ దీన్ని తాగారంటే చాలు.. దెబ్బకు షుగర్ సమస్య తోక ముడుస్తుంది..
చర్మానికి సంబంధించి చాలా మందికి అవగాహన కూడా లేకుండా వచ్చే వ్యాధిలో సోరియాసిస్ ఉంటుంది. ఇది చర్మం మీద ఎర్రగా కందిపోయినట్టు ప్యాచ్ లు గా ఉంటుంది. తెల్లని పొలుసులతో ఉంటుంది. ఈ ప్యాచెస్ సాధారణంగా మోచేతులు, మోకాలు, నెత్తిమీద వస్తాయి. చాలామంది తలలో వచ్చే సొరియాసిస్ ను చుండ్రు అని పొరపాటు పడుతుంటారు. ఇది దురద సమస్యతో ప్రారంభం అవుతుంది. చర్మం మండినట్టు ఉంటుంది. రోజువారీ పనులు చేసుకోవడంలో చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.
పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చర్మం పొడిగా పగుళ్లు ఏర్పడుతుంది. కొన్ని సార్లు రక్తస్రావం జరుగుతుంది కూడా. ఇది చర్మ అసౌకర్యాన్ని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఇది శరీరంలో వ్యాప్తి చెందుతుంది.
Health Tips: పండుగ ముందు పొట్ట ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే ఈ నీరు తాగండి..
సొరియాసిస్ కేవలం చర్మాన్ని మాత్రమే కాదు.. గోళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. గోళ్లు మెత్తబడటం, గుంటలుగా మారడం, రంగు పాలిపోవడం మొదలైన సమస్యలకు దారితీస్తుంది. కొన్ని పరిస్థితులలో గోల్లు వేలి నుండి వేరయ్యే అవకాశం కూడా ఉంటుంది. గోళ్ల భాగం నొప్పిగా, అసౌకర్యంగా మారుతుంది కూడా.
సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది చాలామందిలో కనిపిస్తుంది. ఇందులో కీళ్లలో వాపు, నొప్పి ఎక్కువగా ఉంటాయి. ఇది కీళ్ల దృఢత్వాన్ని, కీళ్ల పనితీరును మందగిస్తుంది. లైఫ్ స్టైల్ మొత్తాన్ని దెబ్బతీస్తుంది.
సోరియాసిస్ సమస్యలో చర్మం పొలుసులుగా ఏర్పడితే అది క్రమంగా రాలిపోతుంది కూడా. అయితే ఈ క్రమంలో చర్మం మీద దురద, పుండ్లు, రక్తస్రావం వంటివి జరిగి చర్మానికి చాలా నష్టం చేకూరుస్తాయి.
ఇవి కూడా చదవండి..
Health Tips: వంటింట్లో ఉండే ఈ నేచురల్ పెయిన్ కిల్లర్స్ గురించి తెలుసా..!
జీలకర్రను ఇలా వాడితే శరీరంలో కొవ్వు కరిగిపోద్ది..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.