Red Foods: ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా? అసలు నిజాలు ఇవీ..!
ABN , Publish Date - Feb 12 , 2024 | 05:44 PM
ఎరుపు రంగు పండ్లు కూరగాయల గురించి లైట్ గా తీసుకుంటారు. కానీ అసలు నిజాలివీ..
ప్రేమ అనే పేరు చెప్పగానే చాలామందికి ఎర్ర గులాబీ లేదా ఎర్రని ప్రేమ గుర్తు గుర్తుకొస్తుంది. ఇవన్నీ కామన్.. అయితే ఆరోగ్యానికి మేలు చేయడంలో కీలక పాత్ర పోషించే పండ్లు, కూరగాయలలో కూడా ఎరుపు రంగు ఉంటుంది. ఈ ఎరుపు రంగు కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? అసలు ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయలు.. అవి ఆరోగ్యం విషయంలో చేసే మేలు తెలుసుకుంటే..
టమోటాలు..
ఎర్రగా నిగనిగలాడే టమోటాలు వంటల్లో తప్పనిసరిగా వాడుతారు. టమోటాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. లైకోపీన్, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండిన టమోటా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పైపెచ్చు వీటిలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి, ఇవి బరువును నియంత్రణలో ఉంచడానికి మంచి ఆప్షన్.
ఇది కూడా చదవండి: ఈ 8 కొరియన్ డ్రింక్స్ ఎంత పవరంటే.. బరువును ఐస్ లా కరిగిస్తాయ్..!
స్ట్రాబెర్రీలు..
స్ట్రాబెర్రీలు చాలామందికి ఫేవరేట్.. ఈ జ్యుసి పండ్లు రొమాంటిక్ ఫీల్ ఇస్తాయి. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, మాంగనీస్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. అలాగే ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
రెడ్ బెల్ పెప్పర్స్..
రెడ్ బెల్ పెప్పర్స్ వంటకాలను కలర్ ఫుల్ గా మారుస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కంలగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రెడ్ బెల్ పెప్పర్స్ లో బీటా-కెరోటిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
రెడ్ క్యాబేజీ
రెడ్ క్యాబేజీ చాలా ఆకర్షణగా ఉంటుంది. ఇతర ఎరుపు రంగు ఆహారాల మాదిరిగానే ఈ కూరగాయలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుండి రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాదు ఎర్ర క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తని పెంచడంలోనూ ఎముకల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి.
చిలగడదుంపలు..
చిలగడదుంపలు ఎర్రగా తీపి రుచితో చాలా రుచిగా ఉంటాయి. ఈ దుంప కూరగాయలో నైట్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో, ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరచడం ద్వారా అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి కూడా అధికం. ఇవి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఇది కూడా చదవండి: Women's Health: ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు.. మహిళలలో గుండె జబ్బుల ప్రమాదం చాలా తగ్గినట్టే..!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.