Share News

RO Water: ఆరోగ్యానికి మంచిది కదా అని ఫిల్టర్ వాటరే తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:41 PM

అసలు ఫిల్టర్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..

RO Water: ఆరోగ్యానికి మంచిది కదా అని ఫిల్టర్ వాటరే తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!

ఇప్పట్లో ఏదీ స్వచ్ఛంగా ఉండట్లేదు ఆహారం దగ్గర నుండి ఉపయోగించే వస్తువుల వరకు కలుషితం కావడం, నాణ్యత లేకపోవడం గమనిస్తూనే ఉంటాం. మనిషికి ఎంతో అవసరమైన ఆహారం, గాలి, నీరు చాలా దారుణంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా నీటి ద్వారా చాలా రోగాలు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి తాగే నీటి విషయంలో చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారు. భూగర్భజలాలు కూడా చాలా దారుణంగా తయారైన పరిస్థితిలో ఇప్పుడంతా ఫిల్టర్ వాటర్ కు అలవాటు పడ్డారు. అయితే ఫిల్టర్ వాటర్ గురించి ఆరోగ్య నిపుణులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. ఆరోగ్యానికి ఎంతోమంచిదని డబ్బు పెట్టి మరీ కొనుక్కుని తాగుతున్న ఈ ఫిల్టర్ వాటర్ వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే(side effects of drinking RO water)..

నీళ్లలో సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ నీటిని ఫిల్టర్ చేయడం వల్ల నీటిలో ఉండే ఖనిజాలు, లవణాలు తొలగిపోతాయి. దీని కారణంగా జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: మాంసాహారాన్ని తలదన్నే శాకాహార ఆహారాలు ఇవే..!


సూక్ష్మపోషకాలు మనిషి శరీరానికి చాలా తక్కువ మొత్తంలోనే అవసరం అవుతాయి. కానీ నీటిని ఫిల్టర్ చేయడం వల్ల శరీరానికి కావలసిన కాసిన్ని సూక్ష్మపోషకాలు కూడా లభించవు. వీటి లోపం వల్ల ఎముకలు బలహీన పడటం, ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది.

సూక్ష్మపోషకాల లోపం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. అదే విధంగా జీర్ణాశయంలో కూడా సమస్యలు ఏర్పడతాయి.

ఇది కూడా చదవండి: Viral: వామ్మో ఈ ఒక్క ఫొటోలో ఇన్ని రహస్యాలున్నాయా? ఈ ఫొటోలో మీకు మొదట కనిపించే దృశ్యం మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుందట..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 18 , 2024 | 12:47 PM