Share News

Running Mistakes: రన్నింగ్ తర్వాత మీకూ కీళ్ల నొప్పుల సమస్య ఉంటోందా? అయితే మీరు చేస్తున్న మిస్టేక్స్ ఇవే..

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:23 PM

రోజూ రన్నింగ్, వాకింగ్ చేసేవారు సాధారణ వ్యక్తులతో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది రన్నింగ్ తర్వాత కీళ్లు నొప్పులు అనుభవిస్తారు. ఫ్రొఫెషనల్ రన్నర్స్ కూడా ఒక్కోసారి రన్నింగ్ కారణంగా కీళ్లు నొప్పులు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తుంటారు. ఈ తప్పులు చేయడం వల్లే అలా జరుగుతుంది.

Running Mistakes: రన్నింగ్ తర్వాత మీకూ కీళ్ల నొప్పుల సమస్య ఉంటోందా? అయితే మీరు చేస్తున్న మిస్టేక్స్ ఇవే..

రన్నింగ్, వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో దోహదపడే వ్యాయామాలు. రోజూ రన్నింగ్, వాకింగ్ చేసేవారు సాధారణ వ్యక్తులతో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది రన్నింగ్ తర్వాత కీళ్లు నొప్పులు అనుభవిస్తారు. ఫ్రొఫెషనల్ రన్నర్స్ కూడా ఒక్కోసారి రన్నింగ్ కారణంగా కీళ్లు నొప్పులు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే రన్నింగ్ విషయంలో కొన్ని తప్పులు చేయడం వల్లే ఇలా ఇబ్బందులు ఎదురవుతుంటాయని ఫిట్నెస్ కోచ్ లు అంటున్నారు. ఇంతకీ రన్నింగ్ విషయంలో చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే..

వార్మప్, కూల్ డౌన్ స్కిప్ చేయడం..

వ్యాయామాలు అయినా, వాకింగ్ అయినా, రన్నింగ్ అయినా వార్మప్ కూల్ డౌన్ వ్యాయామాలు చెయ్యాలి. వీటిని దాటవేయడం వల్ల రన్నింగ్ తర్వాత సమస్యలు వస్తాయి. రన్నింగ్ కు ముందు వార్మప్ చేయడం వల్ల శరీరం వేడెక్కడం, కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. రన్నింగ్ కు అనుగుణంగా శరీరాన్ని సంసిద్దం చేస్తుంది. బిగుతుగా ఉండే కీళ్ళు, స్నాయువులను రిలీజ్ చేయడంలో సహాయపడుతుంది. రన్నింగ్ తర్వాత కూల్ డౌన్ వ్యాయామాలు కూడా శరీరం తిరిగి చల్లబడటంలో సహాయపడుతుంది. వార్మప్, కూల్ డౌన్ వ్యాయామాలు కనీసం 5-10 నిమిషాలు ఉండేలా చూసుకోవాలి.

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!


రన్నింగ్ షూస్..

చాలామంది రన్నింగ్ చేయడానికి, సాధారణ సమయాలలో, వాకింగ్ కోసం ఒకటే రకమైన షూస్ ధరిస్తుంటారు. రన్నింగ్ కోసం మంచి మన్నికైన షూస్ ఎంచుకోవడం ముఖ్యం. ఇవి కాళ్లకు, కీళ్లకు మంచి మద్దతు ఇస్తాయి. కీళ్ల నొప్పులు, కండరాలు దెబ్బతినకుండా చేస్తాయి.

వేగం...

రన్నింగ్ చేసేటప్పుడు ఒక్కసారిగా పరుగు వేగం పెంచడం కూడా కీళ్ల మీద తీవ్రమైన ప్రభావం పడటానికి కారణం అవుతుంది. రన్నింగ్ మొదలయ్యాక శరీరం వేగం అందుకోవడానికి తగినంత సమయం అవసరం. మెల్లిగా వేగాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే కీళ్లు ఒత్తిడికి గురి కావు.

ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఎదురయ్యే పరిణామాలు ఇవే..!


వర్కౌట్స్..

రన్నింగ్ చేసేవారు వర్కౌట్స్ కూడా చెయ్యాలి. దీనివల్ల కండరాలకు, ఎముకలకు, కీళ్లకు మద్దతు లభిస్తుంది. ఇవేమీ చెయ్యకుండా కేవలం రన్నింగ్ చేస్తే కండరాలు బలహీనపడతాయి.

రన్నింగ్ చేసే ప్రదేశం..

రన్నింగ్ చేయడమే కాదు.. రన్నింగ్ చేసే ప్రదేశం కూడా ముఖ్యమే.. సిమెంట్ తో కూడిన గట్టి ఉపరితల ప్రాంతాలు, కఠినమైన దారులలో రన్నింగే చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి పడుతుంది.

ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఎదురయ్యే పరిణామాలు ఇవే..!

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 25 , 2024 | 12:23 PM