Bone Health: ఎముకల ఆరోగ్యం క్షీణిస్తోందనేందుకు ప్రధాన సంకేతాలు ఇవే!
ABN , Publish Date - Aug 17 , 2024 | 10:05 PM
తరచూ ఎముకలు విరగడం, ఎత్తుతగ్గడం వంటివి ఎముకల ఆరోగ్యం క్షీణిస్తోందనేందుకు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో తక్షణం వైద్యులను సంప్రదించడం మేలని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘకాలం పాటు ఆయురారోగ్యాలతో (Health) సంతోషంగా ఉండాలంటే ఎముకలు దృఢంగా ఉండటం ఎంతో కీలకం. అయితే, అనేక మంది ఎముకల ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. చివరకు ఎముకల గుల్లబారి విరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక సమస్యను ముందుగానే గుర్తిస్తే భవిష్యత్తులో రాబోయే అనర్థాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు (signs and Symptoms of deteriorating bone health).
Health: ఇలా చేస్తే మీపై మీకు పూర్తి కంట్రోల్.. మనసు అదుపు తప్పదు!
ఎముకల ఆరోగ్యం తగ్గుతోందని చెప్పే కీలక సంకేతాలు ఇవే..
జారిపడినప్పుడు లేదా బరువైన వస్తువు ఎత్తినప్పుడు ఎముకలు విరిగితే వెంటనే అప్రమత్తమవ్వాలని నిపుణులు చెబుతున్నారు. వైద్యులను సంప్రదించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
వెన్నెముక, తుంటె, మోకాళ్లల్లో నిత్యం నొప్పి వేధిస్తోందంటే ఎముకల ఆరోగ్యం దెబ్బతిన్నట్టు భావించాలి.
కొందరిలో సమయం గడిచే కొద్దీ ఎత్తు తగ్గుతుంటే ఎముకల ఆరోగ్యం దెబ్బతిన్నట్టే. ముఖ్యంగా వెన్నెముక ఒంగిపోయి నడవడం ఎముకల ఆరోగ్యం తగ్గిందనేందుకు ప్రధాన సంకేతం.
నడక, కూర్చోవడం, నిలబడుతున్న తీరులో మార్పులు కూడా ఎముకల ఆరోగ్యం సన్నగిల్లుతోందనేందుకు ఓ కీలక సంకేతం.
నిరంతరం బాధించే వెన్ను నొప్పి కూడా ఎముకల ఆరోగ్యం క్షీణిస్తోందనేందుకు మరో ప్రధాన సంకేతమని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి సందర్భాల్లో వైద్యులను వెంటనే సంప్రదిస్తే సమస్యకు గల కారణాలు వెలుగులోకి వస్తాయి. తద్వారా ముందస్తుగా దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం చిక్కుతుంది. ఇక ఎముకల దృఢత్వం కోసం కాల్షియం, విటమిన్ డీ, వంటివి తినాలని నిపుణులు చెబుతున్నారు. వైద్య శాస్త్రం అభివృద్ధి నానాటికీ అభివృద్ధి చెందుతుండటం మరో సానుకూలం అంశమని అంటున్నారు.