Skin Care: వామ్మో.. ఆవాల నూనె, పసుపు కలిపి ముఖానికి రాస్తే ఇంత మ్యాజిక్కా?
ABN , Publish Date - Oct 01 , 2024 | 01:45 PM
పసుపు, ఆవాల నూనె.. ఈ రెండూ ఆయుర్వేద పరంగా చాలా గొప్పవి. ఈ రెండింటి కలయిక చర్మానికి మ్యాజిక్ చేస్తుంది.
పసుపు దివ్యౌషధం అని చెప్పవచ్చు. పసుపు లేని వంట దాదాపు కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా పసుపును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూనే ఉన్నారు. బోలెడు ఔషద గుణాలు ఉన్న పసుపుకు ఆయుర్వేదం పెద్ద పీట వేస్తుంది. దెబ్బలు తగిలినా, వంటల్లో వాడాలన్నా, చర్మ సంరక్షణలోనూ, వైద్య చికిత్స లోనూ, ఆధ్యాత్మిక పరంగానూ.. ఇలా చాలా రకాలుగా పసుపు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక ఆవాల నూనెను కూడా చాలా ఏళ్ల నుండి వంటల్లోనూ, చర్మ సంర7ణ, కేశ సంరక్షణలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ రెండింటి కలయిక చర్మానికి మ్యాజిక్ చేస్తుందట. ఆవనూనెలో పసుపు కలిపి రాస్తే జరిగేదేంటో తెలుసుకుంటే..
శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఇన్ని అనర్థాలు ఉంటాయా..!
ముఖం మీద మచ్చలు, మొటిమలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరవాలంటే ఆవాల నూనెలో పసుపు కలిపి రాసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
పొడి చర్మం ఉన్నవారు, పదే పదే ముఖ చర్మం పొడిబారడంతో ఇబ్బంది పడేవారు ఆవాల నూనెలో పసుపు కలిపి రాసుకోవాలి. ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.
ఆవాల నూనెలో పసుపు కలిపి రాస్తుంటే ముఖం మీద వాపులు, దద్దుర్లు, మొటిమలు వంటివి రావు. ముఖ చర్మం కోమలంగా మారుతుంది.
ముఖం మీద ఇన్ఫెక్షన్లు, చర్మ సంబంధ సమస్యలు పదే పదే వస్తుంటే దానికి ఆవాల నూనెలో పుసుపు కలిపిన మిశ్రమం అద్బుతంగా పనిచేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ తాలుకు ఎరుపు, మంట, దురద వంటివన్నీ తగ్గిస్తుంది.
30రోజులు వరుసగా ఖర్జూరాన్ని తింటే శరీరంలో కలిగే మార్పులివే..!
పసుపులోనూ, ఆవాల నూనెలోనూ యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేస్తాయి, చర్మ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి.
చర్మం మీద ఉండే రంధ్రాలు మూసుకుపోవడం వల్ల దద్దుర్లు, మొటిమలు, స్కిన్ రాషెస్ వంటివి పదే పదే వస్తుంటాయి. పసుపు కలిపిన ఆవాల నూనెను ముఖం మీద రాస్తుంటే ఈ సమస్య తొలగిపోతుంది. చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. ఓపెన్ పూర్స్ సమస్య ఉన్నవారు దీన్ని వాడుతుంటే చర్మం తిరిగి సహజంగా, యవ్వనంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి..
Health tips: పైన్ విత్తనాలు ఎప్పుడైనా తిన్నారా? ఇవి తింటే ఎన్ని లాభాలంటే..!
Golden Hour: గుండె పోటు తర్వాత గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు ఎందుకు? ఇది ఎందుకు అంత ముఖ్యం?
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.