Skin Care: రాత్రిపూట ఈ టిప్స్ పాటిస్తే చాలు.. వయసు పెరిగినా చర్మం బిగుతుగా యవ్వనంగా ఉంటుంది..!
ABN , Publish Date - Aug 17 , 2024 | 11:25 AM
చర్మం బిగుతుగా, యవ్వనంగా ఉంటే నేచురల్ బ్యూటీ అని పిలుస్తుంటారు. అయితే ఈ కాలం జీవనశైలికి ఇది అంత సులువు కాదు. చాలా చిన్న వయసులోనే చర్మం ముడుతలు పడి ఉన్న వయసు కంటే పెద్దవాళ్లుగా కనిపిస్తుంటారు. కానీ రాత్రి సమయంలో..
అందంగా కనిపించడంలో చర్మ సంరక్షణకు చాలా ప్రాముఖ్యత ఉంది. మేకప్, హెయిర్ స్టైల్, దుస్తుల ఎంపిక అన్నీ పైపై మెరుగులే.. చర్మం బిగుతుగా, యవ్వనంగా ఉంటే నేచురల్ బ్యూటీ అని పిలుస్తుంటారు. అయితే ఈ కాలం జీవనశైలికి ఇది అంత సులువు కాదు. చాలా చిన్న వయసులోనే చర్మం ముడుతలు పడి ఉన్న వయసు కంటే పెద్దవాళ్లుగా కనిపిస్తుంటారు. కానీ రాత్రి సమయంలో కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలు పాటిస్తే అద్భుతమైన అందం సొంతమవుతుంది. రాత్రి సమయంలో కొన్ని వస్తువులను అప్లై చేయడం వల్ల ముఖ చర్మం బిగుతుగా, యవ్వనంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే..
ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!
కొబ్బరినూనె..
రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరినూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె చర్మానికి జీవాన్ని ఇస్తుంది. రోజంతా మేకప్ , పౌడర్, ఫేస్ క్రీములు పూసిన చర్మానికి రాత్రి సమయంలో కొబ్బరి నూనె ఓదార్పును ఇస్తుంది. దీన్ని నార్మల్ స్కిన్ ఉన్నవారు ముఖానికి పట్టించి మసాజ్ చేసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు కొబ్బరినూనె అప్లై చేసిన తరువాత అరగంట లేదా గంట సేపు ఉంచుకుని కడిగేసుకోవచ్చు.
అలోవెరా జెల్..
చర్మం ముడతలు పోగొట్టడంలో అలోవెరా జెల్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలోవెరా లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి ఓదార్పును ఇస్తాయి. చర్మం మీద ముడుతలు కూడా తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని అలోవెరా జెల్ రాసుకుని పడుకోవాలి.
త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?
పచ్చిపాలు..
రాత్రి పడుకునే ముందు పచ్చిపాలతో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే అద్బుత ప్రయోజనాలు ఉంటాయి. పచ్చిపాలు చర్మం లోని మృత కణాలను తొలగించడంలో సహాయపడతాయి. చర్మాన్ని క్లియర్ గా ఉంచడంలో పచ్చిపాలు సహాయపడతాయి.
పెరుగు..
ముడతలు తగ్గాలంటే పెరుగును ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మం మీద ఓపెన్ పోర్స్ ను బిగుతుగా మారుస్తాయి. చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. రాత్రి పడుకునేముందు పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!
పసుపు..
పసుపు కూడా ముఖ దృఢత్వాన్ని పెంచుతుంది. పసుపులో క్రీమ్ లేదా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత కడిగేయాలి. ఇది ముఖ చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ గుణాలు ముఖం మీద ఓపెన్ పోర్స్ తగ్గించడంలో సహాయపడతాయి. పసుపు లో గుణాలు ముఖం మీద మచ్చలు, మొటిమలు, ట్యాన్ వంటివి తొలగించడంలో సహాయపడుతాయి.
ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.