Sleepiness: బాగా నిద్రపోతున్నాం కదా ఏం సమస్యలేదని అనుకుంటున్నారా? అతిగా నిద్రపోయే వాళ్లలో ఈ లోపముంటుంది జాగ్రత్త..!
ABN , Publish Date - Apr 22 , 2024 | 04:35 PM
నిద్ర గొప్ప ఔషదం అంటారు. హాయిగా నిద్రపోయే వ్యక్తిని ఆరోగ్యవంతుడని కూడా అంటారు. ఇప్పటికాలంలో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ అతిగా నిద్రపోయేవారు వేరుగా ఉంటారు. అతిగా నిద్రపోవడం ప్రధానంగా ఈ లోపాల వల్ల జరుగుతుంది.
నిద్ర గొప్ప ఔషదం అంటారు. హాయిగా నిద్రపోయే వ్యక్తిని ఆరోగ్యవంతుడని కూడా అంటారు. ఇప్పటికాలంలో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ అతిగా నిద్రపోయేవారు వేరుగా ఉంటారు. పోషకాల లోపం వల్ల కలిగే సమస్యల్లో నిద్ర సమస్య ఒకటి. పూర్తిగా నిద్రపోయిన తర్వాత కూడా అలసిపోయినట్లు లేదా నిద్రమత్తులో ఉన్నట్లు అనిపిస్తే శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపం ఏర్పడిందని అర్థం. ఇలా నిద్రపోవడం ఆరోగ్యానికి సంకేతం కాదు.. ఇది అనారోగ్యానికి సంకేతం. అతిగా నిద్రపోయే వారిలో ఉండే విటమిన్ల లోపాలేంటో తెలుసుకుంటే..
విటమిన్ డి
విటమిన్ డి లోపం వల్ల అధిక నిద్ర సమస్య వస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. విటమిన్ డి లోపం వల్ల ఎప్పుడూ బలహీనంగా, అలసటగా, బద్ధకంగా ఉంటారు. విటమిన్ డిని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. దీని లోపం వల్ల డిప్రెషన్ సమస్య కూడా రావచ్చు. విటమిన్ డి మన శరీరంలో కాల్షియం, ఫాస్పరస్‌ను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. దీని కారణంగా, బలహీనమైన ఎముకలు, కండరాల నొప్పి, నెమ్మదిగా జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనపడవచ్చు.
Stress: ఒత్తిడి వేధిస్తోందా? ఈ 5 చిట్కాలతో ఈజీగా తగ్గించుకోండి..!
విటమిన్-బి12
విటమిన్ B12 శరీరానికి చాలా అవసరం. దీని లోపం వల్ల విపరీతమైన అలసట, నిద్ర వంటి సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి లోపం వల్ల నాడీ సంబంధిత సమస్యలు, బలహీనమైన కండరాలు, చిరాకు, వేగవంతమైన హృదయ స్పందన వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)