Share News

Sleeping on the Floor: నేలపై పడుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!

ABN , Publish Date - May 31 , 2024 | 04:35 PM

చాలావరకు మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాలను గమనిస్తే సాధారణంగా నేలపై పడుకుంటూ ఉంటారు. పగటి సమయంలోనే కాదు.. రాత్రి సమయంలో కూడా నేలపై చాప లేదా దుప్పటి వేసుకుని ఇంటిల్లిపాదీ హాయిగా నిద్రిస్తుంటారు. నేలపైన పడుకోవడం ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న అలవాటు. చాలా మంది ఆర్థికంగా బాగాలేకపోవడం వల్ల నేలపై పడుకుంటూ ఉంటారని అంటుంటారు. కానీ ..

Sleeping on the Floor:  నేలపై పడుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!

చాలావరకు మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాలను గమనిస్తే సాధారణంగా నేలపై పడుకుంటూ ఉంటారు. పగటి సమయంలోనే కాదు.. రాత్రి సమయంలో కూడా నేలపై చాప లేదా దుప్పటి వేసుకుని ఇంటిల్లిపాదీ హాయిగా నిద్రిస్తుంటారు. నేలపైన పడుకోవడం ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న అలవాటు. చాలా మంది ఆర్థికంగా బాగాలేకపోవడం వల్ల నేలపై పడుకుంటూ ఉంటారని అంటుంటారు. కానీ నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేదం చెప్పిన కొన్ని ప్రయోజాలు తెలుసుకుంటే..

పొజిషన్..

పడుకునే పొజిషన్ సరిగా లేకపోతే శరీరం కంఫర్ట్ గా ఉండదు. వెన్నెముకకు సంబంధించిన గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. అదే గట్టి ఉపరితలం మీద పడుకున్నప్పుడు వెన్నెముకను బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. నేలపై పడుకోవడం వల్ల భూమిలోని పాజిటివ్ శక్తి శరీరంలోకి, శరీరంలోని చెడు శక్తి బయటకు వెళుతుందట. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది.

మీకు తెలుసా..? ఈ భారతీయ నగరాల్లో మాంసాహారాన్ని బ్యాన్ చేశారు..!


వెన్ను నొప్పి..

నేలపై పడుకోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుందంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ అదే నిజం. పరుపు మీద పడుకున్నప్పుడు వెన్నెముక కాస్త వంగే అవకాశం ఉంటుంది. ఇది వెన్ను నొప్పి కలిగిస్తుంది. అదే నేలపై పడుకుంటే వెన్నెముక సమాంతరంగా ఉంటుంది. ఇది వెన్ను నొప్పిని, వెన్ను సమస్యలను తగ్గిస్తుంది.

వేడి..

పరుపులలో ఉండే స్పాంజ్ లేదా పత్తి శరీరాన్ని వేడెక్కిస్తుంది. దీని వల్ల నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది కూడా. అదే నేలపై పడుకున్నప్పుడు శరీర ఉష్ట్రోగ్రత సమతుల్యంగా ఉంటుంది. కాస్త చల్లగా ఉన్న బండల పై పడుకోవడం వల్ల శరీరానికి హాయిగా ఉంటుంది.

ఈ 8 రహస్యాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదట..!


ఒత్తిడి..

శరీరంలో ఒత్తిడి కలిగించే ప్రాంతాలు కొన్ని ఉంటాయి. నేల పై పడుకుంటే శరీర బరువు సమంగా ఉండేలా ఒత్తిడి కలుగుతుంది. వెన్ను నొప్పి, సయాటికా నొప్పి ఉన్నవారు నేలపై పడుకుంటే అద్బుతమైన ఫలితాలు ఉంటాయి.

నిద్రలేమి..

నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి ఉండే ప్రధాన కారణాలలో సరైన ఉపరితలం మీద పడుకోకపోవడం కూడా ఒకటి. నేలపై పడుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారమవుతుంది. మొదట్లో నేలపై పడుకొనేటప్పుడు కొంత నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. కానీ అలవాటయ్యాక నిద్రలేమి సమస్యే ఉండదు.

పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!

ఈ 8 రహస్యాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదట..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 31 , 2024 | 04:35 PM