Share News

Snoring: గురకతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే నిద్రకు ఇబ్బంది ఉండదు..!

ABN , Publish Date - Sep 02 , 2024 | 12:52 PM

చాలామంది గురక పెట్టేవారు వారు మాత్రం హాయిగా నిద్రపోతారు. కానీ వారి పక్కన పడుకునే వారికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది.

Snoring: గురకతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే నిద్రకు ఇబ్బంది ఉండదు..!
Snoring

రాత్రి నిద్రిస్తున్నప్పుడు చిన్నపాటి శబ్దం వచ్చినా నిద్రకు భంగం కలుగుతుంది. అలాంటిది పక్కనే ఉన్న వ్యక్తి గురక పెడుతుంటే ఇంకేమైనా ఉందా? చాలామంది గురక పెట్టేవారు వారు మాత్రం హాయిగా నిద్రపోతారు. కానీ వారి పక్కన పడుకునే వారికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. భార్యాభర్తలు ఈ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. గురక పెట్టే భర్తలు ఉన్న భార్యలు ప్రశాంతంగా నిద్రపోలేరు. గురకను నివారించడానికి కొన్ని పద్ధతులను ప్రయత్నించవచ్చు. ఈ పద్ధతులను ప్రయత్నించడం వల్ల గురకను తగ్గించడమే కాకుండా ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. గురకను తగ్గించడంలో ప్రభావాన్ని చూపే హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుంటే..

ఈ ఉదయపు చెడ్డ అలవాట్ల వల్ల బరువు పెరుగుతారట..!


ఆలివ్ ఆయిల్ థెరపీ..

గురక సమస్యను తగ్గించడంలో ఆయిల్ థెరపీ ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. నిద్రవేళకు ముందు ఒక చెంచా ఆలివ్ నూనెను త్రాగవచ్చు. ఆలివ్ ఆయిల్ తాగడం వల్ల వాయుప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గొంతు, ముక్కును శుభ్రపరుస్తుంది, గురకను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ కండరాలను బిగుతుగా చేస్తుంది. శ్వాస తీసుకోవడానికి తగినంత స్థలం ఉంటుంది. ఇది గురకను నివారిస్తుంది.

నెయ్యి..

ముక్కు చుట్టూ నెయ్యి రాసుకోవడం వల్ల గురక తగ్గుతుంది. ముక్కు చుట్టూ నెయ్యి రాసుకుని నిద్రపోవడం అనేది ముక్కును శుభ్రంగా ఉంచే ఒక ఆయుర్వేద పద్దతి. ఇది గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గురకను నివారిస్తుంది.

విటమిన్-సి ఆడవాళ్ల కంటే మగవారికే ఎక్కువ ముఖ్యం.. ఎందుకంటే..!


నిద్రించే పొజిషన్..

నిద్రించేటప్పుడు పక్కకు ఒరిగి పడుకోవడం వల్ల గురకనను నివారించవచ్చు. వెల్లికిలా పడుకుంటే గురక వస్తుంది. అదే పక్కకు ఒరిగి పడుకోవడం, పక్కన పెద్ద దిండును ఉంచుకోవడం వల్ల శరీర పొజిషన్ మెరుగవుతుంది. గురక తగ్గుతుంది.

బరువు..

బరువు ఎక్కువగా ఉన్నవారిలో గురక సమస్య ఎక్కువ ఉంటుంది. బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజూ అరగంట సేపు వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటూ, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గురక సమస్య కూడా తగ్గుతుంది.

దిండు..

గురక సమస్యను నియంత్రించడానికి దిండు కూడా బాగా సహాయపడుతుంది. తలకింద ఎత్తైన దిండు పెట్టుకోవడం వల్ల గాలి ప్రవాహం మెరుగవుతుంది. ఎత్తుగా ఉన్న దిండు పెట్టుకోవడం వల్ల శ్వాసకోశం తెరచుకుని గురక రాకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి..

ఈ కారణాల వల్ల పెళ్ళిళ్లు చేసుకోకండి.. వివాహ బంధం నిలబడదు..!

కేవలం ఈ 9 అలవాట్లతో మీరు జెమ్ అయిపోతారు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 02 , 2024 | 12:52 PM