Share News

Sodium: సోడియం లోపం గురించి విన్నారా? దీని లోపం ఉంటే ఏం జరుగుతుందంటే..!

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:21 PM

సోడియం శరీరానికి తప్పనిసరిగా అవసరం. కొందరిలో సోడియం లోపం ఏర్పడుతూ ఉంటుంది. అసలు రక్తంలో సోడియం స్థాయి ఎంత ఉండాలి? ఎంత ఉన్నప్పుడు హైపోనట్రేమియా వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

Sodium:  సోడియం లోపం గురించి విన్నారా? దీని లోపం ఉంటే ఏం జరుగుతుందంటే..!

సోడియం శరీరానికి తప్పనిసరిగా అవసరం. శరీరంలో సోడియం లోపం ఏర్పడితే హైపోనట్రేమియా అనే సమస్య వస్తుంది. ఈ సమస్యలో శరీరంలో నీరు, సోడియం సమతుల్యత దెబ్బతింటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రక్తంలో నీరు ఎక్కువ ఉండి సోడియం తక్కువ ఉన్నప్పుడు హైపోనట్రేమియా వస్తుంది. అసలు రక్తంలో సోడియం స్థాయి ఎంత ఉండాలి? ఎంత ఉన్నప్పుడు హైపోనట్రేమియా వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? తెలుసుకుంటే..

సాధారణంగా ఒక వ్యక్తిలో సోడియం స్థాయి 135 నుండి 145 మిల్లీక్వివలెంట్ ఉండాలి. ఒక వేళ ఈ సోడియం స్థాయి 135mEq/L కంటే తక్కువ ఉంటే హెపోనట్రేమియా సంభవిస్తుంది. అయితే రక్తంలో సోడియం తక్కువగా ఉన్న అందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు ఉండవు. ఇవి వ్యక్తికి, వ్యక్తికి వేరుగా ఉంటాయి. ఈ సోడియం స్థాయిలు నెమ్మదిగా తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ అవి చాలా తగ్గిపోతే లక్షణాలు స్పష్టంగా బయటకు కనిపిస్తాయి.

Health Tips: ఈ 4 అలవాటు చేసుకోండి చాలు.. 45ఏళ్లలోనూ 25 ఏళ్లలా యవ్వనంగా కనిపిస్తారు..!



హైపోనట్రేమియా లక్షణాలు..

బలహీనత, అలసట, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల తిమ్మిరి, గందరగోళం, చిరాకు మొదలైనవి హైపోనట్రేమియా లక్షణాలు.

కారణాలు..

హైపోనట్రేమియా ఎందుకు వస్తుందో తెలిపే కారణాలు కొన్ని ఉన్నాయి. శరీరం నుండి నీరు, ఎలక్ట్రోలైట్స్ చాలా ఎక్కువ కోల్పోతే సోడియం స్థాయిలు కూడా చాలా తగ్గిపోతాయి. ఇది హైపోనట్రేమియాకు కారణం అవుతుంది. ఇది మాత్రమే కాకుండా తీవ్రమైన వాంతులు, అతిసారం, యాంటీ డిప్రెసెంట్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, మూత్రవిసర్జన, నిర్జలీకరణ, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ వ్యాధులు, గుండె సమస్యలు, హార్ట్ ఫెయిల్ సహా చాలా కారణాలుగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా బోలు ఎముకల వ్యాధి, మెదడు వాపు, మెదడు గాయం, మూర్చలు, ఎముకల పగుళ్లు కూడా హైపోనట్రేమియా కు కారణం అవుతాయి.

కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయ్.. చెక్ చేసుకోండి..!

ఈ 5 పండ్లు తినండి చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతం..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 06 , 2024 | 05:21 PM