Super Foods: ఈ 5 ఆహారాలు తీసుకుంటూ ఉంటే చాలు.. సీజన్ ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు..!
ABN , Publish Date - Feb 21 , 2024 | 03:25 PM
సీజనల్ సమస్యలు తాత్కాలికమే అయినా చాలా ఇబ్బంది పెడతాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వీటికి ధీటైన ఆహారాలు తీసుకోవాలి
కాలంతో పాటూ వాతావరణంలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది. చలికాలం వచ్చినప్పుడు, చలికాలం నుండి వేసవి కాలం మొదలైనప్పుడు వాతావరణ మార్పుల వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సీజనల్ సమస్యలు తాత్కాలికమే అయినా చాలా ఇబ్బంది పెడతాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వీటికి ధీటైన ఆహారాలు తీసుకోవాలి. వసంతకాలం వల్ల ఎదురయ్యే సీజనల్ సమస్యలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ వైపు ఓ లుక్కేస్తే..
పాలకూర..
పాలకూరలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుశ్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, ఇ, అలాగే యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు అంటువ్యాధులతో పోరాడటానికి, మొత్తం రోగనిరోధక పనితీరుకు తోడ్పడతాయి. పాలకూరను సూప్, సలాడ్, పప్పు ఇలా.. ఏ రూపంలో తీసుకున్నా మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే ఓ చిన్న ముక్క అల్లం నమిలి తింటే.. జరిగేదిదే..!
స్ట్రాబెర్రీలు..
స్ట్రాబెర్రీలు కేవలం రుచిగా ఉండటమే కాదు.. వీటిలో విటమిన్-సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్లరక్తకణాల అభిృద్దికి దోహదపడుతుంది. స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని నేరుగానే తినవచ్చు.
బ్రోకలీ..
క్రూసిఫరస్ జాతికి చెందిన బ్రోకలి పోషకాలకు పవర్ హౌస్. బ్రోకలీలో విటమిన్-ఎ, సి, ఇ ఉన్నాయి. అలాగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటీ ఇన్ప్లమేటరీ, రోగనిరోధకశక్తి గుణాలకు ప్రసిద్ది చెందిన సల్పోరాఫేన్ ను కలిగి ఉంటుంది. ఇది సహజంగా రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుతుంది.
వెల్లుల్లి..
వెల్లుల్లి వంటలకు రుచిని, సువాసనను మాత్రమే కాదు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబయల్, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటాయి. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే జలుబు, ఫ్లూ, దగ్గు వంటి సీజనల్ సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. పైగా రోగనిరోధక శక్తిని కూడా బలంగా మార్చుతుంది.
అస్పరాగస్..
అస్పరాగస్ చలికాలం తరువాత బాగా అందుబాటులోకి వస్తుంది. ఇందులో విటమిన్-ఎ, సి, కె తో పాటూ ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా అస్పరాగస్ లో ప్రీబయోటిక్ ఫైబర్లు ఉంటాయి. ఇవి కూడా రోగనిరోధక శక్తి బలపరచడంలో సహాకరంగా ఉంటాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.