Share News

Hypoglycemia: బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

ABN , Publish Date - Apr 27 , 2024 | 09:37 PM

రక్తంలో చక్కెర నిల్వలు పడిపోతే మెదడు సామర్థ్యం తగ్గడం, కళ్లు తిరగడం, నీరసం, వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. సుదీర్ఘకాలం ఈ సమస్యతో బాధపడితే మెదడు సామర్థ్యం కూడా దెబ్బతింటుందని అంటున్నారు.

Hypoglycemia: బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా షుగర్ వ్యాధి అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమని భావిస్తాం కానీ కొన్ని సందర్భాల్లో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని హైపో గ్లైసీమియా అంటారు. ఇన్సూలిన్ లేదా డయాబెటిస్‌ను నియంత్రించే మందులు అతిగా తీసుకోవడం, అతిగా కసరత్తులు చేయడం, ఆహారం తక్కువగా తీసుకోవడం వంటివి చేస్తే రక్తంలో చక్కెర నిల్వలు పడిపోతాయి (Low blood Sugar).

Lemon Grass: అచ్చం నిమ్మకాయను తలపించే నిమ్మగడ్డితో టీ చేసుకుని రోజూ తాగితే శరీరంలో కలిగే మార్పులివే..!


హైపోగ్లైసీమియాతో వచ్చే సమస్యలు (Symptoms)

చక్కెర నిల్వలు తగ్గిపోతే మెదడు సామర్థ్యం తగ్గుతుంది. మెదడు గ్లూకోజ్‌ను అత్యధికంగా వినియోగిస్తుంది. కాబట్టి, రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గితే మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

హైపోగ్లైసీమియా కారణంగా మూడ్స్‌లో మార్పులు ఎక్కువవుతాయి. చిన్న విషయాలకే చిరాకు పెరుగుతుంది. ఆందోళన, డిప్రెషన్ వంటివి వస్తాయి.

నిత్యం నీరసం వెంటాడుతుంది. కండరాలకు తగిన శక్తి అందక చిన్న చిన్న పనులు కూడా సొంతంగా చేసుకోలేని నిస్సహాయ స్థితి వస్తుంది.

రక్తంలో చక్కెర నిల్వలు తగ్గిపోతే శరీరం అడ్రనలిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది చక్కెర నిల్వలు పెంచే ప్రయత్నం చేసేటప్పుడు ఒంట్లో వణుకు మొదలవుతుంది.

రక్తంలో చక్కెర నిల్వలు దీర్ఘకాలం పాటు తక్కువగా ఉంటే ఫిట్స్ రావడం లేదా స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి కూడా వెళ్లిపోవచ్చు.

అకస్మాత్తుగా రక్తంలో చక్కెర నిల్వలు తగ్గినప్పుడు ఒక్కసారిగా ఆకలి వేస్తుంది. ఇది శరీరంలో కనిపించే సహజసిద్ధమైన మార్పు

చక్కెర నిల్వలు తగ్గిన సందర్భాల్లో కొందరిలో చూపు కూడా మసకబారొచ్చు. దీర్ఘకాలం పాటు హైపోగ్లైసీమియాతో బాధపడే వారి మెదడు సామర్థ్యం కూడా క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు తరచూ షుగర్ టెస్టు చేసుకుంటూ చక్కెర నిల్వలపై ఓ కన్నేసి ఉంచాలి. షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులైనప్పుడు తగు చర్యలు తీసుకోవాలి.

Read Health and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 09:45 PM