Share News

Treadmill: ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేసి చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!

ABN , Publish Date - Aug 15 , 2024 | 09:10 AM

నేటికాలంలో చాలామంది బరువు తగ్గడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కువ మంది వాకింగ్, రన్నింగ్, వ్యాయామాల మీద ఆధారపడతారు. బయట వాకింగ్, రన్నింగ్ వెళ్లలేని వారు ఇంట్లో లేదా జిమ్ లో ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తుంటారు. అయితే

Treadmill: ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేసి చూడండి..  ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!
Treadmill

బరువు తగ్గడం అంత తేలికైన విషయం కాదు. కానీ నేటికాలంలో చాలామంది బరువు తగ్గడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కువ మంది వాకింగ్, రన్నింగ్, వ్యాయామాల మీద ఆధారపడతారు. బయట వాకింగ్, రన్నింగ్ వెళ్లలేని వారు ఇంట్లో లేదా జిమ్ లో ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తుంటారు. అయితే ట్రెడ్ మిల్ లో రన్నింగ్ ను ఏ మోడ్ లో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గాలన్నా ట్రెడ్ మిల్ ను ఏ మోడ్ లో ఉంచాలి తెలుసుకుంటే..

త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?


ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయడం ద్వారా పొట్టను తగ్గించుకోవాలని ట్రై చేస్తుంటే ఇంక్లైన్డ్ మోడ్ మంచిదని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. ఇంక్లైన్డ్ మోడ్ ట్రెడ్ మిల్ పై వంపుగా ఉన్న ప్లాట్ ఫామ్ క్రియేట్ చేస్తుంది. ట్రెడ్‌మిల్‌పై వంపుతో నడవడం లేదా రన్నింగ్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దాదాపు ప్రతి ట్రెడ్‌మిల్‌కు వంపుతిరిగిన మోడ్ ఉంటుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.

ప్రయోజనాలు ఏంటంటే..

ఫిట్ నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వంపు తిరిగిన మోడ్ లో రన్నింగ్ లేదా వాకింగ్ చేస్తే హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!


దీన్ని ఎలా చేయాలి?

ట్రెడ్ మిల్ మీద వంపు తిరిగిన ఈ మోడ్ లో వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం అనేది ఒక కొండ లేదా పర్వతాన్ని ఎక్కుతున్న అనుభూతి ఇస్తుంది. దీన్ని ఉపయోగించడం కోసం ఇంక్లైన్డ్ మోడ్ ను 12శాతంగా ఉంచాలి. గంటకు 5కి.మీ వేగంతో 30 నిమిషాలు రన్నింగ్ చేయాలి. ట్రెడ్ మిల్ మీద ఈ మోడ్ మొదలు పెట్టేముందు మొదట వాకింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ మోడ్ అలవాటు అయిన తరువాత రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక పరిశోధన ప్రకారం 5శాతం వంపు తిరిగిన మోడ్ లో రన్నింగ్ చేస్తే సాధారణం కంటే 17 రెట్లు వేగంగా కేలరీలు బర్న్ అవుతాయట.

ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 15 , 2024 | 09:14 AM