Unwanted Hair: అవాంఛిత రోమాలను తొలగించడం ఇప్పుడు చాలా ఈజీ.. ఈ టిప్స్ ట్రై చేయండి..!
ABN , Publish Date - Jun 26 , 2024 | 03:51 PM
ముఖం క్లిస్టర్ క్లియర్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దానికి తగినట్టే ఎన్నో సౌందర్య చిట్కాలు పాటిస్తుంది. ఇందులో ఫేస్ వ్యాక్సింగ్, షేవింగ్ వంటివి కూడా ఉంటాయి. అయితే ఇవి నొప్పితోనూ, ప్రమాదంతోనూ కూడుకున్నవి.
అవాంఛిత రోమాలు అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే సమస్య. ముఖం క్లిస్టర్ క్లియర్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దానికి తగినట్టే ఎన్నో సౌందర్య చిట్కాలు పాటిస్తుంది. ఇందులో ఫేస్ వ్యాక్సింగ్, షేవింగ్ వంటివి కూడా ఉంటాయి. అయితే ఇవి నొప్పితోనూ, ప్రమాదంతోనూ కూడుకున్నవి. ఇవి కాకుండా ముఖం మీద అవాంఛిత రోమాలను ఎలాంటి నొప్పి, ప్రమాదం లేకుండా తొలగించే చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుకుంటే..
తేనె.. పంచదార..
మృతకణాలు, ముఖం మీద ఉండే వెంట్రుకలను తొలగించడానికి చక్కెర చక్కగా పనిచేస్తుంది. తేనె చర్మాన్ని పోషించడంలో, చర్మానికి మృదుత్వాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇది పీల్-ఆఫ్ మాస్క్ లాగా పనిచేస్తుంది. ఫేషియల్ హెయిర్ ను చాలా ఈజీగా తొలగిస్తుంది.
పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!
ఎలా వాడాలంటే..
1 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకుని కొద్దిగా నీటిలో కలపాలి. చక్కెర కరిగిపోయే వరకు మిశ్రమాన్ని మైక్రోవేవ్‌లో 30 సెకన్ల పాటు ఉంచాలి. అవాంఛిత రోమాలపై ఈ పేస్ట్‌ను అప్లై చేసి దానిపై కాటన్ క్లాత్‌ను ఉంచాలి. ఇది పూర్తీగా చల్లారిన తరువాత దీన్ని రిమూవ్ చేయాలి. ఇలా చేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
మరికొన్ని చిట్కాలు..
అవాంఛిత రోమాలు పోవాలంటే ఒక గిన్నెలో పాలు పోసి అందులో చిటికెడు పసుపు, ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా పంచదార వేసి బాగా ఉడికించాలి. తర్వాత అందులో ఒక చెంచా గోధుమపిండి, ఒక చెంచా శెనగపిండి కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇది పొడిగా మారిన తరువాత కొద్దిగా నీరు అప్లై చేసి ముఖానికి మసాజ్ చేయాలి. దీని తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే ముఖం మీద అవాంఛిత రోమాలు పూర్తీగా తొలగిపోతాయి.
విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!
ముఖం మీద ఉండే అవాంఛిత రోమాలను తొలగించడమే కాకుండా ముఖానికి మెరుపు ఇవ్వడంలో శనగపిండి చాలా బాగా సహాయపడుతుంది. ఒక గిన్నెలో రెండు స్పూన్ల శనగపిండి, రెండు స్పూన్ల రోజ్ వాటర్ వెయ్యాలి. అవసరమైతే దీనికి కొన్ని చుక్కల నిమ్మరసం జోడించాలి. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యరశ్మి నుండి హైపర్ పిగ్మెంటేషన్ నుండి రక్షిస్తాయి. శనగపిండి పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇది పూర్తీగా ఆరిపోయేవరకు అలాగే ఉంచాలి. ఆరిన తరువాత వేళ్లతో రుద్దుతూ తొలగించాలి. ఇలా చేస్తే ముఖం మీద అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. దీన్ని వారంలో రెండు సార్లైనా చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!
పెరుగుతో ఉప్పు లేదా పంచదార.. ఏది కలుపుకుని తింటే ఆరోగ్యమంటే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.