Share News

Vitamin-D Toxicity: విటమిన్-డి శరీరానికి అవసరమే.. కానీ ఇది ఎక్కువైతే ఏం జరుగుతుందంటే..!

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:49 PM

విటమిన్-డి సూర్యుడి లేత కిరణాల నుండి లభ్యమవుతుంది. ఇది మాత్రమే కాకుండా వివిధ రకాల ఆహారాల నుండి కూడా లభ్యమవుతుంది. సూర్యుడి వెలుగు అంతగా లేని రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉండే నెలల్లో విటమిన్-డి లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది ఇళ్లలోనూ, ఆఫీసు గదులలోనూ ఎక్కువగా గడపడం వల్ల విటమిన్-డి లోపం వస్తుంది. కానీ విటమిన్-డి ఎక్కువ తీసుకుంటే మాత్రం..

Vitamin-D Toxicity: విటమిన్-డి శరీరానికి అవసరమే.. కానీ ఇది ఎక్కువైతే ఏం జరుగుతుందంటే..!

విటమిన్-డి శరీరానికి చాలా అవసరమైన విటమిన్. ఇది సూర్యుడి లేత కిరణాల నుండి లభ్యమవుతుంది. ఇది మాత్రమే కాకుండా విటమిన్-డి వివిధ రకాల ఆహారాల నుండి కూడా లభ్యమవుతుంది. సూర్యుడి వెలుగు అంతగా లేని రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉండే నెలల్లో విటమిన్-డి లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది ఇళ్లలోనూ, ఆఫీసు గదులలోనూ ఎక్కువగా గడపడం వల్ల విటమిన్-డి లోపం వస్తుంది. చాలామంది విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంట్లను తీసుకుంటారు. శరీరంలో విటమిన్-డి ఎక్కువ ఉన్నా అది విషంగా మారుతుంది. విటమిన్-డి ఎక్కువగా ఉండటాన్ని విటమిన్-డి టాక్సిసిటీ అంటారు. అసలింతకూ ఇదేంటి? దీనివల్ల శరీరంలో జరిగే మార్పులేంటి? తెలుసుకుంటే..

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!


ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి విటమిన్-డి చాలా కీలకం. కానీ విటమిన్-డి ఎక్కువైతే దాన్ని విటమిన్-డి టాక్సిసిటీ అంటారు. దీని కారణంగా శరీరంలో కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. విటమిన్-డి టాక్సిసిటీ ఏర్పడినప్పుడు దీన్నికనుక్కోవడం పెద్ద సవాలుగా ఉంటుంది.

శరీరం కాల్షియం ను గ్రహించడంలో విటమిన్-డి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ విటమిన్-డి ఎక్కువైతే రక్తంలో కాల్షియం పేరుకుపోతుంది. ఇలా రక్తంలో కాల్షియం పేరుకుపోవడాన్ని హైపర్ కాల్సెమియా అంటారు.

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!


శరీరంలో విటమిన్-డి ఎక్కువ ఉంటే బలహీనత, అలసట, నిరాశ, గందరగోళం, కోమాలోకి వెళ్లడం, పాలీయూరియా వంటి సమస్యలు వస్తాయి.

విటమిన్-డి శరీరంలో ఎక్కువగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రపిండ వైఫల్యం చెందడం, మృదు కణజాలాలలో కాల్సిఫికేషన్లు, కండ్ల కలక, చలి, జ్వరం, అనోరెక్సియా, వికారం, వాంతులు మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.

విటమిన్-డి కోసం సప్లిమెంట్లు తీసుకునేవారిలో కొన్నిసార్లు విటమిన్-డి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిలో విటమిన్-డి టాక్సిసిటీ ఏర్పడుతుంది.

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 25 , 2024 | 01:49 PM